కారు ఢీకొని వ్యక్తి దుర్మరణం | - | Sakshi
Sakshi News home page

కారు ఢీకొని వ్యక్తి దుర్మరణం

Mar 26 2026 10:30 AM | Updated on Mar 26 2026 10:30 AM

కంబాలపల్లిలో ఘటన

మహబూబాబాద్‌ రూరల్‌ : కారు ఢీకొని ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. ఈ ఘటన బుధవారం రాత్రి మహబూబాబాద్‌ మండలం కంబాలపల్లిలో చోటుచేసుకుంది. రూరల్‌ పోలీసులు, 108 ఈఎంటీ బంగారి, పైలెట్‌ ప్రేమ్‌చంద్‌ కథనం ప్రకారం... గ్రామానికి చెందిన గజ్జి ఎర్రయ్య (55) తన ద్విచక్ర వాహనంపై వ్యవసాయ పనులకెళ్లి ఇంటికి వస్తున్నాడు. రోడ్డు దాటుతూ మలుపు తిరుగుతుండగా మహబూబాబాద్‌ వైపు నుంచి గూడూరు వైపునకు వెళ్తున్న కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో ఎర్రయ్యకు తీవ్రగాయాలుకాగా చికిత్స నిమిత్తం 108లో మానుకోట ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా మృతిచెందాడు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.

రైలు ఎక్కబోతూ జారిపడి మహిళ..

ఖిలా వరంగల్‌: రైలు ఎక్కబోతూ ప్రమాదవశాత్తు జారిపడి ఓ మహిళ దుర్మరణం చెందింది. జీఆర్‌పీ హెడ్‌కానిస్టేబుల్‌ రవీందర్‌రెడ్డి కథనం ప్రకారం.. వరంగల్‌ జిల్లా నర్సంపేట మండలం నాగుర్ల పల్లి గ్రామానికి చెందిన బుర్రి మౌనిక(35) బుధవారం సికింద్రాబాద్‌కు వెళ్లేందుకు వరంగల్‌ రైల్వేస్టేషన్‌కు చేరుకుంది. ప్లాట్‌ఫామ్‌పై మణుగూరు సూపర్‌ ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ ఎక్కబోతూ ప్రమాద వశాత్తు జారిపడి తీవ్ర గాయాలతో అక్కడికక్కడే దుర్మరణం చెందింది. మృతురాలి వివరాలు సేకరించారు. ఎంజీఎం మార్చురీలో శవ పంచనామ నిర్వహించి మృతదేహాన్ని భర్త సాంబయ్యకు అప్పగించినట్లు జీఆర్‌పీ హెడ్‌కానిస్టేబుల్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement