కురవి: వసతి గృహాల్లో మెనూ పక్కాగా అమలు చేయాలని ట్రైబల్ వెల్ఫేర్ డీడీ దేశీరాం నాయక్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో ఏటీడీఓలు, పీఎంఆర్‌సీ స్టాఫ్, హెచ్‌ఎంలు, వెల్ఫేర్ అధికారులు, ఎస్సీఆర్‌పీలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు వందశాతం ఫలి తాలు సాధించేలా పనిచేయాలన్నారు. రికార్డులు, రిజిస్టర్లు ప్రతీరోజు నమోదు చేయాలని, ముందస్తుగా బడిబాట కార్యక్రమం నిర్వహించాలని తెలిపారు. కార్యక్రమంలో అధికారులు ఆర్.భాస్కర్, ఉపేందర్, రాములు, విజయ, సారయ్య, బాబు, సునీత, శ్రీకాంత్, సోమని తదితరులు పాల్గొన్నారు.
వైద్య పరీక్షలు అవసరం
దంతాలపల్లి: వాహన డ్రైవర్లకు ప్రతీ మూడు నెలలకు ఒకసారి పూర్తి వైద్య పరీక్షలు అవసరమని తొర్రూరు డీఎస్పీ కృష్ణ కిశోర్ అన్నారు. అరైవ్–అలైవ్ కార్యక్రమంలో భాగంగా బుధవారం ఎస్సై పిల్లల రాజు ఆధ్వర్యంలో వాహన డ్రైవర్లకు ఉచిత కంటి పరీక్షలు నిర్వహించారు. డీఎస్పీ హాజరై మాట్లాడారు. వాహన డ్రైవర్లు ప్రతీ మూడు నెలలకు ఒకసారి వైద్య పరీక్షలు చేయించుకోవాలన్నారు. వాహనదారుల కంటిచూపు బాగుంటేనే.. రోడ్డు ప్రమాదాలు చాలా వరకు తగ్గుతాయన్నారు. వాహనదారులు రహదారి నియమాలు పాటించాలని, మద్యం తాగి వాహనాలు నడపవద్దని సూచించారు. ప్రయాణికులను సురక్షితంగా ఇంటికి చేర్చడం కోసం డ్రైవర్లు బాధ్యతగా వ్యవహరించాలని అన్నారు. కార్యక్రమంలో తొర్రూరు సీఐ గణేష్, వైద్య, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
భద్రకాళి అమ్మవారికి పుష్పార్చన
హన్మకొండ కల్చరల్: భద్రకాళి దేవాలయంలో వసంతనవరాత్ర ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా బుధవా రం అమ్మవారికి పుష్పార్చన నిర్వహించారు. అర్చకులు, శ్రీభద్రకాళి సాంగ ఆగమ వేదపాఠశాల విద్యార్థులు తెలుపురంగు చామంతిపూలకు సంప్రోక్షణ జరిపి అమ్మవారికి లక్షపుష్పార్చన చేశారు. పూజా కార్యక్రమాలకు వేల్పుల భాస్కర్, సత్యవతి, రోహిత్ ఉభయదాతలుగా వ్యవహరించారు. దేవాలయ ధర్మకర్తలు, సిబ్బ ంది పాల్గొన్నారు. దేవాలయ పరిశీలకుడు క్రాంతికుమార్, వాసవీకబ్ల్ ఇంటర్నేషనల్ సెక్రటరీ దాచేపల్లి సీతారాం పాల్గొన్నారు.


