లక్ష్యాల సాధనకు బ్యాంకర్లు సహకరించాలి | - | Sakshi
Sakshi News home page

లక్ష్యాల సాధనకు బ్యాంకర్లు సహకరించాలి

Mar 26 2026 10:29 AM | Updated on Mar 26 2026 10:29 AM

కలెక్టర్‌ స్నేహ శబరీష్‌

నెహ్రూసెంటర్‌: ప్రభుత్వ లక్ష్యాల సాధనకు బ్యాంకర్లు సహకరించాలని కల్టెర్‌ స్నేహ శబరీష్‌ అన్నారు. రైతుల పంట రుణాలు, విద్యా రుణాలు, ఇతర అంశాలపై కలెక్టర్‌ బుధవారం కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్‌ హాల్‌లో ప్రభుత్వ, ప్రైవేట్‌ బ్యాంకర్లతో జిల్లాస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు, దానికి సంబంధించిన పురోగతి తదితర అంశాలను లీడ్‌ బ్యాంక్‌ మేనేజర్‌ వివరించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ.. జిల్లా వార్షిక రుణ ప్రణాళిక వివిధ రంగాలకు సంబంధించి రూ.4,830.32కోట్ల లక్ష్యంగా నిర్ణయించగా.. 2025 డిసెంబర్‌ నాటికి 75.15 శాతం వివిధ రుణ సహాయం అందించినట్లు తెలి పారు. రైతులకు రుణ లక్ష్యాలు చేరుకోవడంలో మరింత పురోగతి సాధించాల్సి ఉందన్నారు. పేద ప్రజల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఆర్థికంగా తో డ్పాటునిచ్చే ప్రణాళికలు ఉంటే వాటిని పరిశీలించాలని, ఏజెన్సీ ప్రాంత ప్రజలకు బ్యాంకర్లు ఆర్థిక తోడ్పాటు అందించాలన్నారు. అదేవిధంగా ముద్ర లోన్లపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. సమావేశంలో నాబార్డ్‌ అధికారి రవి, ఎల్డీఎం యాదగిరి, డీఆర్‌డీఓ మధుసూదన్‌ రాజు పాల్గొన్నారు.

ప్రజల సహకారంతో పట్టణాభివృద్ధి

తొర్రూరు: ప్రజల సహకారంతో పట్టణాన్ని అభివృద్ధి చేస్తామని కలెక్టర్‌ స్నేహ శబరీష్‌ తెలిపారు. పట్టణంలోని మున్సిపాలిటీ కార్యాలయంలో బుధవారం చైర్మన్‌ శ్రావణ్‌కుమార్‌ అధ్యక్షతన బడ్జెట్‌ సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా కలెక్టర్‌ హాజరు కాగా.. కమిషనర్‌ శ్యాంసుందర్‌ బడ్జెట్‌ వివరాలను చదివి వినిపించారు. ఆదాయం, వ్యయం వివరాలతో పాటు వివిధ పథకాల ద్వారా ఆదాయాన్ని ఆశిస్తూ ఈ ఆర్థిక సంవత్సరంలో రూపొందించిన బడ్జెట్‌లో ఆదాయం రూ.17.84 కోట్లు కాగా, వ్యయం రూ.17.83 కోట్లుగా ఆమో దం తెలిపారు. కలెక్టర్‌ మాట్లాడుతూ.. బడ్జెట్‌కు అనుగుణంగా నిధులు సమకూర్చుకుని ప్రజా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయాలన్నారు. ఆర్థిక వనరుల పెంపుపై దృష్టి సారించాలన్నారు. పన్నులు సకాలంలో చెల్లించేలా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. సమావేశంలో మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ సోమ రజిని, కౌన్సిలర్లు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement