గార్ల: గార్ల రైల్వేస్టేషన్‌లో శాతవాహన, ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ రైళ్లు నిలుపుదల చేయాలని దక్షిణ మధ్య రైల్వే డీఆర్‌ఎం గోపాలకృష్ణన్‌ను స్థానికులు కోరారు. బుధ వారం గార్ల రైల్వేస్టేషన్‌లో ఆయన కు వినతిపత్రం అందజేశారు. రైల్వేస్టేషన్‌కు నూతన భవనం నిర్మించి, ప్లాట్‌ఫారాలపై ప్రయాణికులకు కనీస సౌకర్యాలు కల్పించాలని విన్నవించారు. అదే విధంగా రైల్వేస్టేషన్ ప్లాట్‌ఫారాలపై రైల్వే రిజర్వేషన్ బోగీల డిస్‌ప్లే బోర్డులు ఏర్పాటు చేయాలని, ముఖ్యంగా మరుగుదొడ్లు, తాగునీరు, నీడ కోసం రేకుల షెడ్లు నిర్మించాలని కోరారు. డీఆర్‌ఎంను కలిసిన వారిలో రైల్వే డీఆర్‌సీయూ కమిటీ సభ్యుడు జర్పుల లచ్చిరాంనాయక్, ఖాదర్‌బాబా, స్థానికులు కందునూరి ఈశ్వర్‌లింగం, రాధాకృష్ణ, కోల కుమార్‌గౌడ్, బబ్లు, పాషా, బాబు, వెంకన్న, మల్లేష్, రంగారావు, ప్రభాకర్, నాగరాజు, కృష్ణ, అనిల్, రామారావు ఉన్నారు.


