‘బంగారు’ దీప్తి.. | - | Sakshi
Sakshi News home page

‘బంగారు’ దీప్తి..

Mar 22 2026 5:32 AM | Updated on Mar 22 2026 5:32 AM

పరుగు పందెంలో దీప్తి జివాంజీకి

గోల్డ్‌మెడల్‌

పర్వతగిరి: ఒడిశా రాష్ట్ర రా జధాని భువనేశ్వర్‌లో ఇటీవల జరిగిన 24వ జాతీ య పారా అథ్లెటిక్స్‌ చాంపియన్‌ –2026 పోటీల్లో వరంగల్‌ జిల్లా కల్లెడ గ్రా మానికి చెందిన జివాంజీ దీప్తి పరుగు పందెంలో బంగారు పతకం సాధించారు. 57.75 సెకన్ల వ్యవధిలో నిర్ణీత గమ్యానికి చేరుకుని తెలంగాణ నుంచి పాల్గొని బంగారు పతకం సాధించారు. శనివారం భువనేశ్వర్‌లోని కళింగ స్టేడియంలో దీప్తికి పతకం అందజేశారు.

బాలికలపై వీధి కుక్కల దాడి

శివనగర్‌లో ఘటన

ఎంజీఎంకు తరలింపు

ఖిలా వరంగల్‌: వరంగల్‌ శివనగర్‌లోని నాలుగు జెండాల లేన్‌లో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. శనివారం మధ్యాహ్నం గుడియ చందన, వేణు దంపతుల కూతురు అక్షర , బుర్రి అన్నపూర్ణ, ప్రసాద్‌ దంపతుల కూతురు సంజిత ఇంటి ఎదుట ఆడుకుంటున్నారు. ఈ క్రమంలో ఆ బాలికలపై వీధి కుక్కలు దాడికి పా ల్పడ్డాయి. తల్లిదండ్రులు గమనించి కేకలు వేయడంతో కుక్కలు పారిపోయాయి. అప్పటికే గాయపడిన ఇద్దరు బాలికలను తల్లిదండ్రులు ఎంజీఎం తరలించారు. చికిత్స పొందిన అనంతరం ఇంటికి చేరారు. ఈ విషయం తెలిసి స్థానిక కార్పొరేటర్‌ ప్రవీణ్‌.. బాలికలను వారి ఇంటి వద్ద పరామర్శించారు. డివిజన్‌ పరిధిలోని వీధికుక్కలను ఆదివారం పట్టుకుని తరలిస్తామని తెలిపారు.

యువకుడికి కత్తిపోట్లు

మానుకోటలో ఘటన

మహబూబాబాద్‌ రూరల్‌ : మహబూబాబాద్‌ జిల్లా కేంద్రంలో ఓ యువకుడు కత్తిపోట్లకు గురయ్యాడు. ఈ ఘటన శనివారం రాత్రి చోటుచేసుకుంది. జిల్లా కేంద్రంలోని బుక్కబజారు ప్రాంతంలో నివాసం ఉండే బయ్య శివరాజన్‌ ఆర్టీసీ బస్టాండ్‌ దగ్గర గల ఓ వైన్స్‌ షాపులో క్యాంటీన్‌ నిర్వహిస్తుంటాడు. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం కొందరు యువకులు వచ్చి మద్యం సేవించి వెళ్లిన సందర్భంలో అతడితో ఘర్షణ పెట్టుకున్నారు. అనంతరం శనివారం రాత్రి మరికొందరు యువకులు వచ్చి శివరాజన్‌తో మళ్లీ ఘర్షణ పెట్టుకుని కత్తితో దాడిచేసి గాయపరచగా ఛాతి కుడివైపు భాగంలో, తలపై, ఎడమ చెవిలో తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే అతడిని చికిత్స నిమిత్తం ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రికి తరలించగా టౌన్‌ సీఐ గట్ల మహేందర్‌ రెడ్డి, ఎస్సై ప్రశంత్‌ బాబు ఘటనా స్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. బాధితుడి చిన్నమ్మ కుమారుడు రాంప్రసాద్‌ ఫిర్యాదు మేరకు ఆస్పత్రిలోనే ఎఫ్‌ఐఆర్‌ నమో దు చేసి విచారణ చేస్తున్నామని సీఐ మహేందర్‌రెడ్డి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement