బమ్మెరలో చైన్‌స్నాచింగ్‌ | - | Sakshi
Sakshi News home page

బమ్మెరలో చైన్‌స్నాచింగ్‌

Mar 22 2026 5:32 AM | Updated on Mar 22 2026 5:32 AM

పాలకుర్తి టౌన్‌: జనగామ జిల్లా పాలకుర్తి మండలం బమ్మెరలో చైన్‌ స్నాచింగ్‌ జరిగింది. దుండగులు శుక్రవారం సాయత్రం ఓ వృద్ధురాలి మెడలో నుంచి మూడు తులాల బంగారు గొలుసును అపహరించుకెళ్లారు. ఎస్సై దూలం పవన్‌కుమార్‌ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన వృద్ధురాలు మానుపాటి సోమనర్సమ్మ గ్రామంలోని దుర్గమ్మ ఆలయం వెనుక ఆవులను మేపుతోంది. ఈ సమయంలో ఓ గుర్తుతెలియని వ్యక్తి.. వృద్ధురాలితో మాటలు కలిపి ఆమె మెడలోని బంగారు గొలుసు లాక్కున్నాడు. అనంతరం అప్పటికే సిద్ధంగా ఉన్న బైక్‌పై మరో వ్యక్తితో కలిసి పరాయ్యాడు. దీంతో సోమనర్సమ్మ బోరున విలపిస్తూ ఇంటికెళ్లి తన కుమారుడికి ఘటనను వివరించింది. దీంతో ఆమె కుమారుడు పోలీసులకు విషయం తెలుపగా వర్ధన్నపేట ఏసీపీ అంబటి నర్సయ్య, సీఐ జానకిరాంరెడ్డి ఘటనాస్థలిని పరిశీలించారు. అనంతరం బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎవరైనా అనుమానితలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఏసీపీ శనివారం తెలిపారు.

వృద్ధురాలి మెడలో నుంచి మూడు తులాల బంగారు గొలుసు చోరీ

ఘటనాస్థలిని పరిశీలించిన పోలీసులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement