పారదర్శకంగా ఎంటీఎస్‌ పోస్టుల ఎంపిక | - | Sakshi
Sakshi News home page

పారదర్శకంగా ఎంటీఎస్‌ పోస్టుల ఎంపిక

Mar 22 2026 5:32 AM | Updated on Mar 22 2026 5:32 AM

జనగామ రూరల్‌: కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జనగణన 2026 కోసం జిల్లాలో కాంట్రాక్ట్‌ ప్రాతిపదికన 16 టెక్నికల్‌ అసిస్టెంట్‌, 1 మల్టీ టాస్కింగ్‌ స్టాఫ్‌ పోస్టుకు జిల్లా ఉపాధి కార్యాలయం ద్వారా నోటిఫికేషన్‌ విడుదల చేసిన విషయం విధితమే. ఈ మేరకు శనివారం టెక్నికల్‌ అసిస్టెంట్‌ పోస్టులకు మొత్తం 243 మంది దరఖాస్తు చేసుకోగా అందులో భాగంగా మెరిట్‌ ఆధారంగా 84 మంది అభ్యర్థులకు శనివారం కలెక్టర్‌ కార్యాలయంలోని కాన్ఫరెన్స్‌ హాల్‌లో నైపుణ్య పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షలో ఉత్తమ మార్కులతో ప్రతిభ కనబరిచి ఉత్తీర్ణత సాధించిన వారిని పారదర్శకంగా ఎంపిక చేయడం జరిగిందని కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝా స్పష్టం చేశారు. అలాగే మల్టీ టాస్కింగ్‌ స్టాఫ్‌ పో స్టుకు మొత్తం 52 మంది దరఖాస్తు చేసుకోగా 1:6 రేషియోలో మె రిట్‌ ఆధారంగా 6 మంది అభ్యర్థుల కు ఇంటర్వ్యూ నిర్వహించి ఒకరిని ఎంపిక చేశామన్నారు. ఇన్‌చార్జ్‌ ఉపాధి అధికారి రవికాంత్‌, సీపీఓ చిన కో ట్యా నాయక్‌, సూపరింటెండెంట్‌ ఫణికుమార్‌ పాల్గొన్నారు.

పరీక్షకు పిలిచారు.. వద్దన్నారు

జనగామ: జనగణన–2026 సేవలకు సంబంధించి ఔట్‌ సోర్సింగ్‌ పద్ధతిలో ఉద్యోగ నియామకాల కోసం పరీక్ష ఉంటుందని సమాచారం అందించి, తమను కేంద్రంలోకి అనుమతించలేదని పలువురు నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం కలెక్టరేట్‌లో జనగణన కోసం ఔట్‌ సో ర్సింగ్‌ ప్రాతిపదికన (16)టెక్నికల్‌ అసిస్టెంట్‌, ఒక మల్టీ టాస్కింగ్‌ స్టాప్‌ పోస్టుల భర్తీ కోసం జిల్లా ఉపాధి అధికారి (ఇన్‌చార్జ్‌) రవికాంత్‌ ఆధ్వర్యంలో పరీక్ష న్విహించారు. మె రిట్‌ ఆధారంగా 84 మందిని పిలవాల్సి ఉండగా, సుమారు 13 మందికి అదనంగా మెసెజ్‌ పంపించారు. పరీక్షకు మెరిట్‌ ఆధారంగా లోపలికి అనుమతించగా, మిగతా వారు ఆవేదనకు గురయ్యారు. తమను ఎందుకు అనుమతించడం లేదంటూ నిరసన తెలిపారు. ఈ విషయమై రవికాంత్‌ మాట్లాడుతూ కంప్యూటర్‌ ఆపరేటర్లు మెసేజ్‌ పంపించే క్రమంలో సుమారు 10 నుంచి 13 మందికి అదనంగా సమాచారం వెళ్లిందన్నారు. పరీక్షకు అనుమతించని క్రమంలో వారికి జరిగిన తప్పిదాన్ని వివరించామని, ఈ విషయాన్ని కలెక్టర్‌ దృ ష్టికి సైతం తీసుకెళ్లామన్నారు. వచ్చే ఉద్యోగ మేళాలో వీరికి ఫస్ట్‌ ప్రియార్టీ ఇవ్వాలని కలెక్టర్‌ చెప్పారన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement