తలసరిలో లాస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

తలసరిలో లాస్ట్‌

Mar 22 2026 5:32 AM | Updated on Mar 22 2026 5:32 AM

జీడీడీపీలో ఫస్ట్‌..

సాక్షి, వరంగల్‌: భౌగోళిక హద్దుల్లోని వస్తుసేవల ఉత్పత్తుల్లో ఉమ్మడి వరంగల్‌లో హనుమకొండ జిల్లా 30,480 కోట్లతో గ్రాస్‌ డిస్ట్రిక్ట్‌ డొమెస్టిక్‌ ప్రొడక్ట్‌ (జీడీడీపీ)లో ప్రథమ స్థానంలో నిలవగా, తలసరి ఆదాయంలో మాత్రం రూ.2,37,809తో చివరి స్థానంలో ఉందని తెలంగాణ సోషియో ఎకానమిక్‌ నివేదిక 2026 పేర్కొంది. అంతేకాదు తలసరి ఆదాయంలో రాష్ట్రంలోనే హనుమకొండ చిట్టచివరి స్థానం ఉండడం ఆందోళన కలిగిస్తోంది. అలాగే, పారిశ్రామికీకరణలో భాగంగా హనుమకొండ జిల్లాలో 703 ఫ్యాక్టరీలు, అత్యల్పంగా జయశంకర్‌ భూపాలపల్లిలో 82 ఫ్యాక్టరీలు ఉన్నాయి. ఎంఎస్‌ఎంఈలు అత్యధికంగా హనుమకొండలో 3 7,362 ఉండగా, అత్యల్పంగా ములుగులో 5,515 ఉన్నాయి. ఉదయ్‌ పోర్టల్‌లో 2020 జూలై నుంచి 2025 డిసెం

బర్‌ 22 వరకు రిజిస్టర్‌ అయిన మాన్యుఫ్యాక్చరింగ్‌ యూనిట్లు ఎక్కువగా హనుమకొండలో 7,517 ఉంటే ములుగులో 1,636 ఉన్నాయి. ఇక వరంగల్‌ జిల్లా విషయానికొస్తే జీడీడీపీలో రెండో స్థానం, ఫ్యాక్టరీ, ఎంఎస్‌ఎంఈ, ఉదయ్‌ పోర్టల్‌లో రిజిస్టర్‌ అయినమాన్యుఫ్యాక్చరింగ్‌ యూనిట్లలో రెండో స్థానంలో నిలిచింది.

తెలంగాణ సోషియో ఎకానమిక్‌ నివేదికలో హనుమకొండ జిల్లా స్థానం

జీడీడీపీ, ఫ్యాక్టరీలు, ఎంఎస్‌ఎంఈలో వరంగల్‌ రెండో స్థానం

ఉమ్మడి వరంగల్‌లో తలసరి ఆదాయంలో ములుగు జిల్లా ఫస్ట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement