మహబూబాబాద్ రూరల్: వేసవి(రబీ)లో తక్కువ వనరులతో అధిక నికర లాభాన్ని అర్జించి పెట్టే పంటల్లో ను వ్వుల సాగు ఒకటి. ఈ పంట అన్నదా తల ఇంట్లో సిరులు కురిరిస్తుంది. ఈ క్రమంలో ఈ పంటను ఏ సమయంలో సాగు చేయాలి.. ఏ నేలలో చేయాలి.. విత్తనం ఎలా చల్లాలి.. చీడపీడల నివారణకు ఏ మందులు వాడాలి అనే అంశాలపై మహబూబాబాద్ మండలం మల్యాల కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త బి.క్రాంతికుమార్ రైతులకు పలు సలహాలు, సూచనలు ఇచ్చారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే..
● రబీలో ‘ఆరుతడి’గా నువ్వులు సా గు చేసి అధిక దిగుబడి పొందొచ్చు.
● నువ్వుల్లో నూనె శాతం 46 నుంచి 56 వరకు ఉంటుంది. ప్రొటీన్లు 20 నుంచి 25 శాతం వరకు ఉంటాయి.
● విటమిన్లు, అమైనో ఆమ్లాలతోపాటు పాటీ ఆమ్లాలు సమృద్ధిగా ఉంటాయి.
● ఖరీఫ్ పంటలు ఆలస్యంగా వేసినప్పుడు, రెండో పంటగా జనవరి, ఫిబ్రవరి నెలల్లో విత్తుకుని అతి తక్కువ సమయంలో పంట ఉత్పత్తిని పొందొచ్చు.
● రబీ పంటగా నువ్వుల సాగులో చీడపీడల బెడద తక్కువ ఉంటుంది. విత్తన నాణ్యత పెరిగి అధిక దిగుబడులు పొందొచ్చు.
● మురుగు నీరు నిల్వని, తేలికపాటి నేలలు సాగుకు అనుకూలం. పొడి దుక్కి ఉండేలా చూసుకోవాలి.
● విత్తనాన్ని సన్నని ఇసుకలో కలిపి సమంగా వెదజల్లాలి.
రకాలు:
● రాజేశ్వరి, శ్వేత, చందన, హిమ వంటి రకాలతోపాటు ఇతరత్రా అనువై న రకాలను సాగుకు ఎంచుకోవాలి.
● రకాలను బట్టి 80 నుంచి 85 రోజుల కాలపరిమితి ఉంటుంది.
● విత్తిన వెంటనే మొదటి తడి ఇవ్వాలి.
● పూత, కాయ అభివృద్ధి, గింజ కట్టుదశలో తడులు ఇవ్వాలి.
● విత్తిన 35 నుంచి 40 రోజుల వరకు, 65 నుంచి 70 రోజుల వ రకు నీటి ఎద్దడి లేకుండా చూడాలి.
● పంట పెరిగే దశల్లో పిండినల్లి, ఆకుమచ్చ, వెర్రి తెగులు ఆశిస్తాయి.
● వాటి నివారణకు సకాలంలో నివారణ చర్యలు చేపట్టడం ద్వారా నువ్వుల సాగు దిగుబడిలో మంచి ఫలితాలు పొందొచ్చు.


