ఖిలా వరంగల్: రాష్ట్రంలో ముస్లిం, మైనార్టీల సంక్షేేమాభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. రంజాన్ సందర్భంగా శనివారం ఉదయం 10గంటలకు ఖిలావరంగల్ పెట్రోల్ బంక్ జంక్షన్‌లోని ఈద్గామైదానంలో ఈద్గా అభివృద్ధి కమిటీ ప్రతినిధి ఎంఏ జబ్బార్ ఆధ్వర్యంలో ఈద్గా మత గురువు మౌలానా మహ్మద్ నౌమాన్ రాజ్ నేతృత్వంలో ముస్లింలు సామూహిక ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రి సురేఖ, మేయర్ గుండు సుధారాణి, రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య, తహసీల్దార్ ఇక్బాల్ ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి సురేఖ మాట్లాడుతూ సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని ప్ర జా ప్రభుత్వం పేద ముస్లింల అభ్యున్నతే లక్ష్యంగా పనిచేస్తోందన్నారు. ఇందులో భాగంగా రూ.కోటితో మట్టెవాడ, రూ.కోటితో ఖిలావరంగల్, రూ.60 లక్షలతో ఎల్‌బీనగర్, రూ.40 లక్షల వ్యయతో చింతల్ ఈద్గాల అభివృద్ధికి చర్యలు తీసుకున్నామని, ఆ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. సోదరభావం, దాతృత్వం, ఆధ్యాత్మికత, మత సామరస్యానికి రంజాన్ ప్రతీకగా నిలుస్తుందన్నారు. అనంతరం మేయర్ గుండు సుధారాణి మాట్లాడుతూ సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ముస్లింల అభివృద్ధికి చిత్తశుద్ధితో పనిచేస్తోందన్నారు. ముస్లింలు ప్రశాంత వాతావరణంలో రంజాన్ పర్వదినాన్ని జరుపుకునేలా నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశామని స్పష్టం చేశారు. ఈద్గా ప్రతినిధి చాంద్‌పాషా, ఎండీ ముగ్దూం, మహమ్మద్ షకీల్, మీర్జా హసన్ అలీబేగ్, యాకూబ్, సర్వర్, మాషూక్, అబీబ్, అంకూస్, మహమ్మద్ జానీ, రబ్బానీ, ఎండీ అమ్జద్, స్థానిక కార్పొరేటర్లు పోశాల పద్మ, కాంగ్రెస్ నేతలు గోపాల నవీన్‌రాజ్, మీసాల ప్రకాశ్, కేడల పద్మ, జనార్ధన్, కొత్తపెల్లి శ్రీనివాస్, బాసాని శ్రీనివాస్, కర్రె కుమార్, పగడాల సతీశ్, శ్రీరామ్ రాజేశ్, దామోదర్‌యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
రూ.3కోట్ల వ్యయంతో ఈద్గాల అభివృద్ధి
రాష్ట్ర అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ


