గీసుకొండ : గ్రేటర్ వరంగల్ 15వ డివిజన్ గొర్రెకుంటకు చెందిన తెలంగాణ ఉద్యమకారుడు కోట ప్రవీణ్ దీన స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు. కిడ్నీలు పాడైపోయి చికిత్స కోసం డబ్బులు లేని దుస్థితిలో ఉన్నాడు. ప్రవీణ్ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 2001 నుంచి 2014 వరకు ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నాడు. ఈ క్రమంలో ఇటీవల రెండు కిడ్నీలు పాడైపోయి అనారోగ్యంతో బాధపడుతున్నాడు. వైద్య పరీక్షలు, చికిత్స చేయించడానికి అవసరమైన డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్నాడు. దీనిపై దాతలు స్పందించి ప్రవీణ్‌కు ఆపన్న హస్తం అందించాలని కుటుంబీకులతోపాటు ఉద్యమకారుల సంఘం వరంగల్ జిల్లా అధ్యక్షుడు గుర్రం రఘు కోరుతున్నారు. సహాయం చేయాలని అనుకునే వారు 9908413955 నంబర్‌కు ఫోన్ పే చేయాలని వారు వేడుకుంటున్నారు. కాగా, శనివారం గీసుకొండ మాజీ జెడ్పీటీసీ పోలీసు ధర్మారావు, ఉద్యమకారుడు నమిండ్ల ప్రమోద్ , ప్రభుత్వ టీచర్ కర్ణకంటి రామ్మూర్తి , గుర్రం రఘు, నాగుర్ల వెంకటేశ్వర్లు, సిరిసే శ్రీకాంత్, కొమరెళ్లి కిరణ్.. ప్రవీణ్‌కు ఆర్థిక సాయ అందించారు.
అనారోగ్యంతో బాధపడుతున్న
తెలంగాణ ఉద్యమకారుడు ప్రవీణ్
పాడైన కిడ్నీలు.. చికిత్స కోసం
డబ్బులు లేని దుస్థితి
దాతలు ఆదుకోవాలని వేడుకోలు


