ప్రజల హక్కులను హరిస్తున్న కేంద్రం
నెహ్రూసెంటర్: కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కార్మిక చట్టాలు, హక్కులను హరిస్తోందని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జి.నాగయ్య విమర్శించారు. ప్రజా, కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ దేశవ్యాప్త నిరసన కార్యక్రమంలో భాగంగా జిల్లా కేంద్రంలో సోమవారం ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజా వ్యతిరేక చట్టాలను తీసుకువచ్చి కార్మికులు, ప్రజలు పోరాడి సాధించుకున్న చట్టాలను కాలరాసేందుకు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ఉపాధిహామీ పథకాన్ని యథావిధిగా కొనసాగించాలన్నారు. సీఐటీయూ, వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘం ఆధ్వర్యంలో జరిగిన ర్యాలీలో సీపీఎం జిల్లా కార్యదర్శి శ్రీనివాస్, వెంకన్న, వీర య్య, రాజన్న, సోమయ్య, రాజు, ఉపేందర్, రాజ మౌళి, సుధాకర్, వెంకట్‌రెడ్డి, యాకూబ్ ఉన్నారు.


