మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటాలి
మహబూబాబాద్: మున్సిపల్ ఎన్నికల్లో సత్తాచాటాలని మాజీ ఎంపీ మాలోత్ కవిత పిలుపునిచ్చారు. బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కేంద్రంలో మున్సిపల్ ఎన్నికలపై సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మున్సిపల్ ఎన్ని కల్లో బీఆర్‌ఎస్ గెలుపు తధ్యమని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయలేదన్నారు. మానుకోట నియోజకవర్గంలోని మా నుకోట, కేసముద్రం మున్సిపాలిటీల్లో గులాబీ జెండా ఎగురవేయడం ఖాయమన్నారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే బానోత్ శంకర్‌నాయ క్, నాయకులు శ్రీనివాస్‌రెడ్డి, రవి, కెఎస్‌ఎన్ రెడ్డి, వెంకన్న, మురళీధర్‌రెడ్డి, రంజిత్, జనా ర్దన్, ఫరీద్, శంకర్, గోిపి తదితరులు పాల్గొన్నారు.
బాల్య వివాహరహిత సమాజమే లక్ష్యం
మహబూబాబాద్ రూరల్: బాల్య వివాహరహిత సమాజ సాధనలో విద్యార్థులు భాగస్వాములు కావాలని అసిస్టెంట్ లీగల్ డిఫెన్స్ కౌన్సిల్ వి.రాజ్ కృష్ణ అన్నారు. మహబూబా బాద్ మండలం పర్వతగిరి జెడ్పీ ఉన్నత పాఠశాలలో సోమవారం న్యాయ అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో బాల్య వివాహ రహిత భారతదేశం, 100రోజుల విస్తృత ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 18ఏళ్లు నిండకుండా అమ్మాయికి, 21 ఏళ్లు నిండకుండా అబ్బాయికి పెళ్లి చేయడం చట్టరీత్యా నేరమన్నారు. విద్యార్థులు తమ దృష్టికి వచ్చిన బాలల సమస్యలపై ఫిర్యాదు చేయడానికి చైల్డ్ హెల్ప్ లైన్ టోల్ ఫ్రీ నంబర్ 1098లో సంప్రదించాలని సూచించారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ బాల్యవివాహాలపై రూపొందించిన లఘు చిత్రాన్ని ప్రదర్శించారు. అనంతరం ఉపాధ్యాయుడు నట్టె రవి మాట్లాడారు. కార్యక్రమంలో బోధన సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
కేయూ, ముల్కనూరు సొసైటీ ఎంఓయూ
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ, ముల్కనూరు సొసైటీ మధ్య సోమవారం అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదిరిందని కేయూ రిజిస్ట్రార్ వి.రామచంద్రం తెలిపారు. వీసీ కె.ప్రతాప్‌రెడ్డి సమక్షంలో కేయూ హాస్టళ్ల డైరెక్టర్ ఎల్‌పీ రాజ్‌కుమార్, ముల్కనూరు కో–ఆపరేటివ్ సొసైటీ ప్రతినిధులు రాంరెడ్డి, అభిలాష్‌రెడ్డి ఈ ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. ఈ ఎంఓయూతో కేయూ హాస్టళ్ల మెస్‌లకు అవసరమైన బియ్యాన్ని సరఫరా చేసేందుకు ఆసంస్థ నిబంధనల ప్రకారం ఒ ప్పందం కుదుర్చుకుంది. కాగా ఆరునెలల పా టు బియ్యాన్ని కేయూ హాస్టళ్ల మెస్‌లకు సరఫ రా చేస్తారు. నాణ్యతగల బియ్యాన్ని అందించనున్నట్లు రిజిస్ట్రార్ తెలిపారు.
మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటాలి


