మహిళలు ఆర్థికంగా ఎదగాలి
మహబూబాబాద్/మహబూబాబాద్ అర్బన్: మహిళలు ఆర్థికంగా ఎదగాలని మానుకోట ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్ అన్నారు. మానుకోట మున్సిపాలిటీ, మెప్మా ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కేంద్రంలోని బ్రహ్మంగారి గుడి కల్యాణ మండపంలో మున్సి పల్ పరిధిలోని 620 స్వయం సహాయక సంఘాలకు రూ.2,41,62,256 వడ్డీ లేని రుణాల పత్రాలను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళలు అన్ని రంగా ల్లో రాణించాలన్నారు. మహిళల అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం వడ్డీలేని రుణాలు, ఫ్రీబస్సు సౌకర్యంతో పాటు పలు పథకాలను ప్రవేశపెట్టిందన్నారు. ఆర్డీఓ కృష్ణవేణి, తహసీల్దార్ చంద్ర రాజేశ్వర్, మున్సిపల్ కమిషనర్ రాజేశ్వర్, మెప్మా డీఎంసీ విజయ, మహిళలు పాల్గొన్నారు.
మహిళలకు వడ్డీ లేని రుణాల చెక్కు అందజేస్తున్న ఎమ్మెల్యే మురళీనాయక్


