రెండో రోజు పోటాపోటీగా ఆర్చరీ పోటీలు
నెల్లికుదురు: ఎస్‌జీఎఫ్ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరుగుతున్న ఆర్చరీ (విలువిద్య) పోటీలు సోమవారం రెండో రోజు పోటాపోటీగా సాగాయి. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి వచ్చిన 250 మంది బాలబాలికలు రెండో రోజు క్రీడల్లో పాల్గొన్నట్లు ఎస్‌జీఎఫ్ జిల్లా సెక్రటరీ జి.సత్యనారాయణ, అసిస్టెంట్ సెక్రటరీ అయిలయ్య తెలిపారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ వెంకరెడ్డి, ఎంఈఓ రామ్‌దాస్, హెచ్‌ఎంలు రవి, శంకర్, ప్రణయ్, ప్రభు, సునీత, తదితరులు పాల్గొన్నారు.


