ఖాళీ స్థలాలు శుభ్రం చేయించాలి
మానుకోట మున్సిపాలిటీ పరిధిలో ఖాళీ స్థలాలను శుభ్రం చేయించాలి. పందులు, దోమల సంఖ్య పెరిగి ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. 13వార్డులో నా ఇంటి పక్కనే మాలె నాగేశ్వర్‌రావు అనే వ్యాపారి ఖాళీ స్థలం ఉంది. దానిని శుభ్రం చేయాలని చెబితే పట్టించుకోవడం లేదు. అందుకే ప్రజావాణిలో వినతి అందజేసిన. – మేకల శ్రీనివాస్, మానుకోట
ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలి
ఇందిరమ్మ ఇంటి కోసం దరఖాస్తు చేసుకోగా మంజూరు చేయలేదు. అన్ని అర్హతలు ఉన్నప్పటికీ నా పేరు రాలేదు. నాలుగుసార్లు ప్రజావాణిలో దరఖాస్తులు అందజేసినా సమస్య పరిష్కారం కాలేదు. దివ్యాంగుల పరిస్థితిని కూడా అర్థం చేసుకోవడం లేదు. అధికారులు ఇల్లు మంజూరు చేయాలి. – బండారి ఽశ్రీనివాస్, దివ్యాంగుడు, గార్ల
							ఖాళీ స్థలాలు శుభ్రం చేయించాలి

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
