జాతర పనులు వేగవంతం చేయాలి
కురవి: మండలంలోని కందికొండ గుట్టపై వెలిసిన లక్ష్మీనర్సింహస్వామి జాతర పనులను వేగవంతంగా పూర్తి చేయాలని మహబూబాబాద్ ఆర్డీఓ కృష్ణవేణి తెలిపారు. సోమవారం కందికొండ గుట్ట వద్ద జరుగుతున్న జాతర పనులను ఆమె వివిధ శాఖల అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలన్నారు. రోడ్లను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంగా పనిచేసి జాతరను విజయవంతం చేయాలని సూచించారు. కార్యక్రమంలో తహసీల్దార్లు విజయ, పున్నంచందర్, మరిపెడ సీఐ రాజ్‌కుమార్‌గౌడ్, ఎంపీడీఓ వీరబాబు, ఎంపీఓ గౌస్, పంచాయతీ కార్యదర్శి నరేష్, ఆర్‌ఐలు రవికుమార్, లక్ష్మీరెడ్డి, సీరోలు ఎస్సై సంతోష్, ఏపీఓ భూపాల్‌రెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు అంబటి వీరభద్రంగౌడ్, దయ్యాల శ్రీధర్, చందూలాల్ పాల్గొన్నారు.
ఆర్డీఓ కృష్ణవేణి

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
