వరి పంటల పరిశీలన
గూడూరు: మండలంలోని పొనుగోడు, రాములుతండా, చిర్రకుంటతండాలో వరి పంటల్లో తాలు శాతం ఎక్కువగా ఉందన్న ఫిర్యాదుతో మల్యాల కృషి విజ్ఞాన కేంద్రం వ్యవసాయ శాస్త్రవేత్తలు సోమవారం పరిశీలించారు. పంటలను పరిశీలించి వరి గింజలను హైదరాబాద్ ల్యాబ్‌కు పంపనున్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. శాస్త్రవేత్తలు డాక్టర్ దిలీప్, క్రాంతి మాట్లాడుతూ.. ల్యాబ్ రిపోర్ట్ ద్వారా రైతులకు విత్తన కంపెనీ, షాపు నిర్వాహకుడి ద్వారా న్యాయం జరిగేలా చూస్తామన్నారు. వ్యవసాయ సహాయ సంచాలకులు మురళి, ఏఓ అబ్దుల్‌మాలిక్, బాధిత రైతులు పాల్గొన్నారు.

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
