నా భూమి కాజేశాడు..
తోడేళ్లగూడెం గ్రామంలో నాపేరిట ఉన్న భూమిని నాకు తెలియకుండా నా పెద్ద కుమారుడి కొడుకు కాజేశాడు. అధికారి భూమిని నా మనవడి పేరున మార్చాడు. విచారణ చేసి న్యాయం చేయాలి.
– శాంతమ్మ, తోడేళ్లగూడెం, డోర్నకల్
పింఛన్ మంజూరు చేయాలి
నా భర్త తొమ్మిది సంవత్సరాల క్రితం మృతి చెందాడు. అప్పటి నుంచి వితంతువు పింఛన్ కోసం తిరుగుతున్నా. అధికారులు స్పందించి పింఛన్ మంజూరు చేయాలి. నా కొడుకులు పట్టించుకోవడం లేదు. డబ్బులు లేక ఇబ్బంది అవుతుంది. – సామ్రాజ్యం, డోర్నకల్
మూడుసార్లు వినతి ఇచ్చినా పని కాలేదు
పక్షవాతం వచ్చి ఎడమ కాలు, చేయి పని చేయడం లేదు. పింఛన్, ట్రైౖసైకిల్ మంజూరు చేయాలని మూడుసార్లు వినతిపత్రం అందజేశా. ఆటోకు వచ్చినప్పడుల్లా మూడు వందలు అవుతుంది.. పని మాత్రం కావడం లేదు. నా పరిస్థితి అర్థం చేసుకుని పింఛన్ మంజూరు చేయాలి. – జంపాల రాములు, గుమ్మడూరు
							నా భూమి కాజేశాడు..
							నా భూమి కాజేశాడు..

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
