చేప పిల్లల పంపిణీ పారదర్శకంగా చేపట్టాలి
మహబూబాబాద్: చేప పిల్లల పంపిణీ కార్యక్రమం పారదర్శకంగా నిర్వహించాలని రాష్ట్ర పశు సంవర్థక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అధికారులను ఆదేశించారు. సోమవారం హైదరాబాద్ నుంచి మంత్రి వాకిటి శ్రీహరి.. కలెక్టర్లు, మత్స్యశాఖ అధికారులతో చేపల పంపిణీపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి సమీక్షించారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. చేప పిల్లలు చెరువులకు చేరేలా అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలన్నారు. చేప పిల్లల పంపిణీ కార్యక్రమం ఇప్పటికే ఆలస్యమైందని, ఈనెల 20వ తేదీ వరకు పూర్తి చేయాలన్నారు. టీ మత్స్య యాప్‌లో చేప పిల్లలు, సరఫరాదారుల వివరాలు, రవాణా చేసే వాహనం సంపూర్ణ సమాచారం ఉందన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ అద్వైత్‌కుమార్ సింగ్, అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో, మత్స్యశాఖ జిల్లా అఽధికారి శివ ప్రసాద్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
వీసీలో రాష్ట్ర పశు సంవర్థక శాఖ
మంత్రి వాకిటి శ్రీహరి

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
