భూ తగాదాలకు సాక్షిగా ఉన్నాడని.. | - | Sakshi
Sakshi News home page

భూ తగాదాలకు సాక్షిగా ఉన్నాడని..

Nov 4 2025 8:16 AM | Updated on Nov 4 2025 8:16 AM

భూ తగాదాలకు సాక్షిగా ఉన్నాడని..

భూ తగాదాలకు సాక్షిగా ఉన్నాడని..

యువకుడి దారుణ హత్య

చిల్పూరు: భూ తగాదా లకు సాక్షిగా ఉన్నాడనే కారణంతో ఓ యువకుడిని దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన జనగామ జిల్లా చిల్పూరు మండలం కొండాపూర్‌లో చోటు చేసుకుంది. సీఐ ఏడవెళ్లి శ్రీని వాస్‌ రెడ్డి, మృతుడి భార్య కావేరి తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన మోతె జితేందర్‌, మో తె జీవన్‌, మోతె కిష్టయ్య కుటుంబాల మధ్య వ్యవసాయ భూమి, మామిడి తోటల విషయంలో గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో రెండేళ్ల క్రితం మోతె కిష్టయ్యను చంపుతామంటూ జితేందర్‌, జీవ న్‌ అతడి చుట్టూ ట్రాక్టర్‌ తిప్పుతూ భయభ్రాంతులకు గురిచేస్తుండగా ఫొటోగ్రాఫర్‌ అయిన ముత్యా ల నరేశ్‌(34) ఈ ఘటనను వీడియో, ఫొటోలు తీ శాడు. వాటిని పోలీసులకు చూపించగా ఇద్దరిపై కే సు నమోదు చేసి జైలుకు తరలించారు. జైలు నుంచి వచ్చాక ఇద్దరు.. నరేశ్‌పై కక్ష పెంచుకున్నారు. ఈ క్రమంలో మరో కొద్దిరోజుల్లో కోర్టులో ఈ కేసు ఉండడంతో ఫొటోల సాక్షిగా ఉన్న నరేశ్‌ను బెదిరించేందుకు ఆదివారం సాయంత్రం గ్రామానికి చేరుకున్నారు. అనంతరం మొదట గ్రామస్తుడు మాచర్ల రమేశ్‌ బైక్‌పై తన ఇంటికి వెళ్తుండగా జితేందర్‌, జీవన్‌తోపాటు మరో ఆరుగురు కలిసి కర్రతో దాడి కి పాల్పడ్డారు. దీంతో తీవ్రంగా గాయపడిన రమేశ్‌ రమేశ్‌ పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. అప్పటికే నిందితులు పరారయ్యారు.

నమ్మకంగా ఫోన్‌ చేయించి హత్య..

ఆదివారం సాయంత్రం ఫొటో స్టూడియోలో ఉన్న నరేశ్‌కు నమ్మకం కలిగేలా జితేందర్‌, జీవన్‌.. ఇతరు లతో నరేశ్‌కు ఫోన్‌ చేయించారు. దీంతో నరేశ్‌ ఇప్పు డే వస్తానంటూ భార్యకు చెప్పి బయటకు వెళ్లాడు. కాలనీ సమీపంలో ఒంటరిగా వెళ్తున్న నరేశ్‌ను జితేందర్‌ ఒక్కసారిగా తన ఇంట్లోకి లాక్కెళ్లాడు. అక్కడ గొడ్డలి, కర్రలతో చితకబాది చీరతో ఉరేసి చంపారు. రాత్రి అవుతున్నా నరేశ్‌ ఇంటికి రాకపోవడంతో పలుమార్లు అతడి భార్య కావేరి ఫోన్‌ చేసింది. అయినా స్పందించకపోవడంతో రమేశ్‌ను కొట్టినవారే తన భర్తను ఏదైనా చేసి ఉండొచ్చనే అనుమానంతో ఈ విషయం గ్రామస్తులకు తెలిపింది. అప్పటికే పోలీసులు కూడా గ్రామానికి చేరుకోగా అందరూ కలిసి నరేశ్‌ కోసం పలు చోట్ల రాత్రి 2 గంటల వరకు వెతికినా ఫలితం లేకపోవడంతో వెనక్కి వచ్చారు. ఈ క్రమంలో నరేశ్‌ మృతదేహాన్ని నిందితులు తమ మామిడి తోటలోకి తీసుకెళ్లి పడేశారు. గ్రామస్తులు, కుటుంబ సభ్యులు సోమవారం ఉదయం మామిడి తోటలో వెతుకుతుండగా కాళ్లు, చేతులు వెనక్కి కట్టిపడేసి ఉన్న మృతదేహం కనిపించింది.

ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు..

విషయం తెలియగానే ఏసీపీ భీంశర్మ, రఘునాథపల్లి సీఐ శ్రీనివాసరెడ్డి ఘటనాస్థలికి చేరుకున్నారు. మృతుడి భార్య నుంచి వివరాలు సేకరించారు. భార్య కావేరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయగా ఏఆర్‌ఐ అర్జున్‌.. శవ పంచనామా చేశారు. పో స్టుమార్టం నిమిత్తం ఎంజీఎం తరలించారు. కాగా, మృతుడికి రెండు నెలల కుమారుడు ఉన్నాడు.

మరొకరిపై దాడికి పాల్పడిన

దుండగులు..తీవ్రగాయాలు

చిల్పూరు మండలం కొండాపూర్‌లో ఘటన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement