6న తెలుగు విభాగం పీహెచ్‌డీలో ప్రవేశాలకు ఇంటర్వ్యూ
● రీషెడ్యూల్ చేసిన అధికారులు
కేయూ క్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీలోని తెలుగు విభాగం పీహెచ్‌డీలో ప్రవేశాలకు దరఖాస్తులు చేసుకున్న అభ్యర్థులకు మళ్లీ ఈనెల 6న ఉదయం 10 గంటలకు ఇంటర్వ్యూ నిర్వహించనున్నారు. తెలుగు విభాగంలో రెండు పీహెచ్‌డీ సీట్లు వెకెన్సీలు ఉండగా గతనెలలో ప్రవేశాలకు సంబంఽధిత ఆర్ట్స్ డీన్ సురేశ్‌లాల్ నోటిఫికేషన్ ఇచ్చి దరఖాస్తులు స్వీకరించారు. 31మంది అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోగా ఇంటర్వ్యూ కూడా నిర్వహించారు. అయితే ఎంపికై న జాబితాను వెల్లడించకముందే వీసీ, రిజిస్ట్రార్ల దృష్టికి పలు ఆరోపణలు వెళ్లడంతో ఆ ఇంటర్వ్యూను రద్దు చేశారు. ఈ క్రమంలో మళ్లీ ఈనెల 6వతేదీన ఇంటర్వ్యూ నిర్వహించేందుకు రీషెడ్యూల్ చేశారు. ఈ సమాచారాన్ని సంబంధిత అభ్యర్థులకు కూడా పంపారని తెలుస్తోంది. జేఆర్‌ఎఫ్ ఫెల్లోషిప్ అభ్యర్థులకు ప్రాధాన్యం ఉంటుందని తెలుస్తోంది. ఆ తర్వాత నెట్ అభ్యర్థులకు కూడా ఉంటుంది. రెండు సీట్లలో ఒకటి ఓసీ కేటగిరీ, మరోటి మిగతా అన్ని కేటగిరీలు కలిపి ఉన్నట్లు తెలుస్తోంది.
బ్రిడ్జిలు నిర్మించాలని శీర్షాసనం
● జనగామ కలెక్టరేట్ వద్ద గానుగుపహాడ్, చీటకోడూరు బ్రిడ్జి సాధన సమితి ఆందోళన
జనగామ రూరల్: జనగామ నుంచి హుస్నాబాద్ వెళ్లే దారి గానుగుపహాడ్ వద్ద అసంపూర్తిగా ఉన్న బ్రి డ్జి నిర్మాణం పూర్తిచేయాలని, అలాగే చీటకోడూ రు బ్రిడ్జి నిర్మాణం పనులు మొదలుపెట్టాలని.. సో మవారం పట్టణంలో బ్రిడ్జిసాధన సమితి అధ్యక్షుడు యాసారపు కర్నాకర్ ఆధ్వర్యంలో గాడిదకు మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివా సరెడ్డి ఫ్లెక్సీ ఫొటోలు అంటించి నిరసన తెలిపారు. వెంటనే పోలీసులు అడ్డుకుని వాటిని తొలగించా రు.అనంతరం ర్యాలీగా కలెక్టరేట్ వద్దకు చేరుకు న్నారు. కలెక్టరేట్ ఎదుట చీటకోడూర్‌కు చెందిన ఉమాపతి శీర్షాసనం వేస్తూ నిరసన తెలిపారు. సందీప్, గానుగ్‌పహాడ్, చీటకో డూర్ బ్రిడ్జి సాధ న సమితి సభ్యులు పాల్గొన్నారు.
6న తెలుగు విభాగం పీహెచ్‌డీలో ప్రవేశాలకు ఇంటర్వ్యూ


