
బూత్ స్థాయిలో పార్టీని బలోపేతం చేయాలి
మహబూబాబాద్ అర్బన్: బూత్‌స్థాయిలో బీజేపీని బలోపేతం చేయాలని జిల్లా అధ్యక్షుడు వల్లభు వెంకటేశ్వర్లు అన్నారు. జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో కొరివి మండలం నారాయణపురం గ్రామపంచాయతీ నుంచి శనివారం పలువురు యువతను బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. సంస్థాగతంగా బలంగా ఉన్నప్పుడే ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు వస్తాయన్నారు. రానున్న ఎన్నికల్లో కమలం జెండా ఎగురవేయడమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు, యువకులు పనిచేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు శ్యామ్, రామచందర్ రావు, జిల్లా ప్రధాన కార్యదర్శి గడ్డం అశోక్, నాయకులు సతీష్, నరేష్ నాయక్, సందీప్, నారాయణపురం గ్రామపంచాయతీ యువకులు తదితరులు పాల్గొన్నారు.
బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్లు