– వెంకటాపురం(ఎం) | - | Sakshi
Sakshi News home page

– వెంకటాపురం(ఎం)

Oct 12 2025 6:55 AM | Updated on Oct 12 2025 7:06 AM

న్యూస్‌రీల్‌

ఆదివారం శ్రీ 12 శ్రీ అక్టోబర్‌ శ్రీ 2025
నీటిలో తేలియాడే ఇటుకలు.. నల్లరాతి స్తంభాలు.. సరిగమలు పలికే శిల్పం.. భూకంపాలను తట్టుకునే ఆలయం.. ఓరుగల్లుకు చరిత్ర అందించిన అతిగొప్ప వరం రామప్ప. యునెస్కో గుర్తింపుతో ఈఆలయ గొప్పదనం విశ్వవ్యాప్తమైంది. ఇప్పుడు ఆ కట్టడం ప్రపంచ దేశాలకు ఆదర్శమవుతోంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పర్యాటకులు, చరిత్రకారులు వారి వారి దేశాల్లో రామప్పను పోలిన కట్టడాలు నిర్మించడంలో భాగస్వాములవుతున్నారు. అంతేకాకుండా ఓరుగల్లులోని వివిధ ప్రాంతాల్లో నిర్మించిన అద్భుత కట్టడాలను పరిచయం చేస్తూ వాటి గొప్పదనాన్ని ప్రపంచ నలుమూలలకు తెలిసేలా వరల్డ్‌ హెరిటేజ్‌ క్యాంపు వివిధ దేశాల వలంటీర్లకు శిక్షణ ఇస్తోంది. ఈ క్యాంపు ప్రత్యేకతలే ఈ ఆదివారం ‘సాక్షి’ స్పెషల్‌ స్టోరీ.

వలంటీర్లకు రామప్ప ఆలయ శిల్పాల ప్రత్యేకతలను వివరిస్తున్న టూరిస్ట్‌ గైడ్‌

రల్డ్‌ హెరిటేజ్‌ కమిటీ ఏటా అక్టోబర్‌లో వివిధ దేశాల వలంటీర్లకు శిక్షణ ఇస్తోంది. గత నాలుగేళ్లుగా రామప్పలో క్యాంపు కొనసాగుతుండగా.. ప్రస్తుతం ఈనెల 8న క్యాంపు ప్రారంభమైంది. 12 రాష్ట్రాలకు చెందిన 35 మందితో పాటు ఇరాన్‌ దేశానికి చెందిన మరో ముగ్గురు శిక్షణ శిబిరంలో పాల్గొంటున్నారు. ఈనెల 17తో హెరిటేజ్‌ క్యాంపు ముగియనుంది.

రామప్ప ఖ్యాతిని విస్తరిస్తా..

శిక్షణ శిబిరంలో నేర్చుకున్న మెళకువలతో రామప్ప ఖ్యాతిని విస్తరించేందుకు కృషి చేస్తా. మ్యూజియంలో పని చేయడానికి, మ్యూజియానికి వచ్చిన ప్రజలకు చారిత్రక కట్టడాల గురించి వివరించేందుకు ప్రయత్నం చేస్తా. ఆలయంలోని ఆర్కిటెక్చర్‌ చాలా డిఫెరెంట్‌గా బాగుంది.

– హమీద్‌ దాస్‌, కోల్‌కతా

ఇండియా కల్చర్‌ నచ్చి వచ్చాను..

ఇండియా కల్చర్‌ అంటే చాలా ఇష్టం. గతంలో కెన్యా, ఇరాన్‌ హెరిటేజ్‌ క్యాంపులో పాల్గొన్నా. రామప్పలో హెరిటేజ్‌ క్యాంపు వాటి కంటే బాగుంది. పర్సనల్‌గా ఇండియా కల్చర్‌పై ప్రాజెక్ట్‌ తీసుకుని ఇక్కడి పాఠాలను అనుభవంగా తీసుకుంటా. రామప్ప టెంపుల్‌ వండర్‌ ఫుల్‌.

– నియూషా, ఇరాన్‌

– వెంకటాపురం(ఎం) 1
1/5

– వెంకటాపురం(ఎం)

– వెంకటాపురం(ఎం) 2
2/5

– వెంకటాపురం(ఎం)

– వెంకటాపురం(ఎం) 3
3/5

– వెంకటాపురం(ఎం)

– వెంకటాపురం(ఎం) 4
4/5

– వెంకటాపురం(ఎం)

– వెంకటాపురం(ఎం) 5
5/5

– వెంకటాపురం(ఎం)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement