విషజ్వరాల పంజా | - | Sakshi
Sakshi News home page

విషజ్వరాల పంజా

Oct 10 2025 6:14 AM | Updated on Oct 10 2025 6:14 AM

విషజ్

విషజ్వరాల పంజా

జిల్లాలో పెరుగుతున్న జ్వరపీడితులు

రోగులతో ఆస్పత్రులు కిటకిట

బాధితుల్లో పిల్లలే ఎక్కువ

సాక్షి, మహబూబాబాద్‌/నెహ్రూసెంటర్‌: జిల్లాలో విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. దగ్గ, జలుబు, ఒంటి నొప్పులతో మొదలైన జ్వరాలు.. సాధారణ చికిత్సతో మూడు నాలుగు రోజుల్లో తగ్గుతున్నా యి. అయితే పిల్లలు, మహిళలు విష జ్వరాలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానంగా దో మ కాటుతో వచ్చే జ్వరాలు ప్రమాదకరంగా మారుతున్నాయని వైద్యు లు చెబుతున్నారు.

కిటకిటలాడుతున్న ఆస్పత్రులు..

జ్వర పీడితుల సంఖ్య రోజురోజుకూ పెరగడంతో ప్రభుత్వ ఆస్పత్రులతో పాటు ప్రైవేట్‌ ఆస్పత్రులు రోగులతో కిట కిటలాడుతున్నాయి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో చికిత్స చేయించుకునే వారిలో జ్వరాలు తగ్గడం లేదని ప్రైవేట్‌ బాట పడుతున్నారు. మారిన పరిస్థితులు, జ్వరాల తీవ్రతను తగ్గించేందుకు ప్రభుత్వ ఆస్పత్రుల్లో సరైన మందులు లేవని డాక్ట ర్లు చెబుతున్నారని, గత్యంతరం లేక వేల రూపాయలు ఖర్చు పెట్టి ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో చికిత్సం చేయించుకుంటున్నామని బాధితులు చెబుతున్నారు.

జ్వరాలు పెరుగుతున్నాయి

ఇటీవల జ్వరాల బారిన పడి వస్తున్నవారి సంఖ్య పెరుగుతోంది. ప్రధానంగా చిన్నపిల్లల్లో ఎక్కువ జ్వరాలు వస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో వైరల్‌ ఫీవర్స్‌ ఇబ్బందిగా మారుతున్నాయి. మూడు రోజులకు పైగా జ్వరం ఉంటే పరీక్షలు చేయించుకోవాలి. డాక్టర్‌ సలహా మేరకు మందులు వాడాలి. అశ్రద్ధ చేయవద్దు.

–బానోత్‌ నెహ్రూ, జనరల్‌ ఫిజీషియన్‌

ఓపీ 150నుంచి 200మంది

మరిపెడ: మండల కేంద్రంలోని పీహెచ్‌సీకి వారం రోజులుగా ప్రతీరోజు 150నుంచి 200మంది వరకు రోగులు వస్తున్నారు. ఇన్‌పేషెంట్లు ప్రతీరోజు పది మందికి మించి ఉంటున్నారు. ప్రధానంగా వైరల్‌ ఫీవర్‌, టైఫాయిడ్‌ బారిన పడిన రోగులు అధికంగా వస్తున్నారు. ఒక్కోసారి రోగులకు బెడ్లు సరిపోవడం లేదు.

గూడూరు: మండల కేంద్రంలోని కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌(సీహెచ్‌సీ)కు వారం నుంచి ప్రతీరోజు 100 నుంచి 150మంది వరకు జ్వరపీడితులు వస్తున్నారు. దీంతో ఆస్పత్రి ఇన్‌వార్డు జ్వరపీడితులతో నిండుకుంటుంది. అలాగే చాలామంది రోగులు ప్రైవేట్‌ ఆస్పత్రులకు క్యూ కడుతున్నారు. కాగా మండలంలోని తీగలవేణి, అయోధ్యపురం పీహెచ్‌సీల పరిధిలో ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.

నీరసంగా ఉంది..

నాలుగు రోజులుగా జ్వరంతో బాధపడుతున్నా. ముందు ఆర్‌ఎంపీ వద్ద చూపించుకున్నప్పటికీ తగ్గలేదు. అందుకే గూడూరు ఆస్పత్రికి వచ్చా. కాస్త జ్వరం తగ్గింది. కానీ నీరసంగా ఉంటుంది. –బానోతు కోట్యా, ఏపూరు

డెంగీ కేసులు

377

ఫీవర్‌ కేసులు

31,648

జిల్లాలో మొత్తం వైద్య శిబిరాలు 1,713

శ్వాసకోశ సంబంధిత కేసులు 14,400

మలేరియా కేసులు

06

విషజ్వరాల పంజా1
1/3

విషజ్వరాల పంజా

విషజ్వరాల పంజా2
2/3

విషజ్వరాల పంజా

విషజ్వరాల పంజా3
3/3

విషజ్వరాల పంజా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement