రెండో రోజు కొనసాగిన శిబిరం | - | Sakshi
Sakshi News home page

రెండో రోజు కొనసాగిన శిబిరం

Oct 10 2025 5:52 AM | Updated on Oct 10 2025 5:52 AM

రెండో

రెండో రోజు కొనసాగిన శిబిరం

వెంకటాపురం(ఎం): మండలంలోని రామప్పలో గురువారం రెండో రోజు వరల్డ్‌ హెరిటేజ్‌ వ లంటీర్ల శిక్షణ శిబిరం కొనసాగింది. గురువా రం ఉదయం 6గంటలకు యోగా గురువు రాంబాబు వలంటీర్లకు యోగాసనాలు నేర్పించా రు. 11 గంటల నుంచి ప్రొఫెసర్‌ పాండురంగారావు, స్థపతి శివనాగిరెడ్డి కాకతీయ కట్టడాలు, ఆలయాల నిర్మాణాలు, వాటి విశిష్టతలను వలంటీర్లకు తెలిపారు. రామప్ప ఆలయానికి యునెస్కో గుర్తింపు ఎలా వచ్చిందో వివరించారు. అనంతరం వలంటీర్లు ఆలయాన్ని సందర్శించారు. గైడ్‌ విజయ్‌కుమార్‌ రామప్ప విశిష్టత గురించి వివరించారు. కార్యక్రమంలో క్యాంపు కోఆర్డినేటర్‌ శ్రీధర్‌రావు పాల్గొన్నారు.

పోక్సో కేసులో ఒకరికి 20 ఏళ్ల జైలు

ఏటూరునాగారం/ములుగురూరల్‌: పోక్సో కేసులో ఒకరికి 20 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ ములు గు జిల్లా పోక్సో కోర్టు న్యాయమూర్తి తీర్పు వెలువరించినట్లు ఎస్పీ శబరీశ్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఓ బాలికపై లైంగికదాడికి పాల్ప డిన ఘటనలో ముళ్లకట్టకు చెందిన మంతెన రామయ్యపై అడ్డూరి ఉదయ ఫిర్యాదు మేరకు 2023లో పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. దర్యాప్తు అనంతరం కోర్టులో చార్జ్‌షీట్‌ దాఖలు చేశారు. గురువారం తుది విచారణ చేసిన జిల్లా పోక్సో కోర్టు.. నిందితుడు మంతె న రామయ్యపై నేరం రుజువు కావడంతో 20 ఏళ్ల జైలు శిక్షతోపాటు రూ. 12వేల జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించిందని ఎస్పీ తెలిపా రు. అప్పటి ఏఎస్పీ శిరిశెట్టి సంకీర్త్‌, ఎస్సై ఇంద్రయ్య కేసు నమోదు చేసి విచారణ చేపట్టారన్నారన్నారు. నిందితుడికి శిక్ష పడేలా కృషిచేసిన ఏఎస్పీ సంకీర్త్‌, ప్రస్తుత ఏఎస్పీ శివం ఉపాధ్యాయను ఎస్పీ అభినందించారు. బాధితురాలికి రూ.10లక్షల పరిహారం కూడా ఇప్పించేందుకు కోర్టు చర్యలు తీసుకుంటుందన్నారు.

గంజాయి సాగు చేసిన వ్యక్తిపై కేసు

తరిగొప్పుల: కూరగాయలతోపాటు గంజాయి పెంచుతున్న వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై శ్రీదేవి తెలిపారు. మండలంలోని అక్కరాజుపల్లికి చెందిన సాకేత్‌ కమలేశ్‌ తన ఇంటి ఆవరణలో కూరగాయలతోపాటు గంజాయి పెంచుతున్నాడనే సమాచారం మేరకు గురువారం తనిఖీ చేశామన్నారు. ఇందులో 30 అంగుళాల పొడవైన గంజాయి మొక్కను గుర్తించామన్నారు. ఆ మొక్క సుమారు 6.5 కేజీల ఉంటుందన్నారు. కమలేశ్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. కాగా, సాకేత్‌ కమలేశ్‌ పరారీలో ఉన్నాడని ఎస్సై తెలిపారు.

సృజనాత్మకతను వెలికి తీసేందుకే పోటీలు

విద్యారణ్యపురి: విద్యార్థుల్లోని సృజనాత్మకత ను వెలికితీసేందుకు సైన్స్‌ డ్రామా పోటీలు దో హదం చేస్తాయని జిల్లా విద్యాశాఖలోని క్వాలి టీ కో–ఆర్డినేటర్‌ బండారు మన్మోహన్‌ అన్నారు. గురువారం హనుమకొండ జిల్లా సైన్స్‌ కేంద్రంలో జిల్లా స్థాయి సైన్స్‌ డ్రామా పోటీలు ముగిశాయి. ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఈపోటీల్లో ‘హైజీన్‌ ఫర్‌ ఆల్‌ అందరి కోసం పరిశుభ్రత’ అంశంపై శ్యాయంపేట తెలంగాణ బాలికల సాంఘిక సంక్షేమ పాఠశాల విద్యార్థులు ప్రదర్శించిన డ్రామా రాష్ట్ర స్థాయికి ఎంపికై నట్లు జిల్లా సైన్స్‌ అధికారి ఎస్‌.శ్రీనివాసస్వామి తెలిపారు. లయన్స్‌ క్లబ్‌ హనుమకొండ అధ్యక్షుడు టి.రమేశ్‌బాబు, బాధ్యులు ప్రభాకర్‌ పాల్గొన్నారు. న్యాయ నిర్ణేతలుగా ప్రముఖ రంగస్థల, సినీ నటుడు బీటరవం శ్రీధరస్వామి, హిందీ స్కూల్‌ అసిస్టెంట్‌ చెడుపాక రాములు వ్యవహరించారు. ఈపోటీల్లో పాల్గొన్న విద్యార్థులకు సర్టిఫికెట్లు ప్రదానం చేశారు.

రెండో రోజు కొనసాగిన శిబిరం
1
1/2

రెండో రోజు కొనసాగిన శిబిరం

రెండో రోజు కొనసాగిన శిబిరం
2
2/2

రెండో రోజు కొనసాగిన శిబిరం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement