
తేలిన స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్లు
స్థానిక పరిస్థితులకు
అనుగుణంగా విభజన
జెడ్పీటీసీ, ఎంపీటీసీల ఎన్నికలు రెండు విడతలు, సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలు మూడు విడతలుగా నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకుంది. దీనికి అనుగుణంగా జిల్లా అధికారులు మండలాల విభజన చేసినట్లు తెలిసింది. ప్రధానంగా మొత్తం పోలింగ్ స్టేషన్లు, ఎన్నికల నిర్వహన ఉద్యోగులు, సిబ్బంది లభ్యత, శాంతి భద్రతల పరిరక్షణ మొదలైన అంశాలను పరిగణనలోకి తీసుకున్నట్లు అధి కారులు చెబుతున్నారు. కాగా, ఒక వైపు జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల కోలాహలం.. మరోవైపు సర్పంచ్ ఎన్నికల సందడి.. ఇలా ఎవరి గోల వారిది అన్నట్లు ఉంటుంది.
జిల్లా వివరాలు
మండలాలు : 18
జెడ్పీటీసీ స్థానాలు : 18
ఎంపీపీ స్థానాలు : 18
ఎంపీటీసీ స్థానాలు : 193
పోలింగ్ స్టేషన్లు : 1,066
సర్పంచ్ స్థానాలు
482
వార్డులు
4,110
సాక్షి, మహబూబాబాద్: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగింది. నాలుగైదు రోజుల నుంచి రిజర్వేషన్లపై జరుగుతున్న చర్చలు, రిజర్వేషన్ల ప్రకటనలకు ఫుల్‌స్టాప్ పెడుతూ అధికారులు ఎట్టకేలకు సోమవారం అధికారికంగా ప్రకటించారు. దీంతోపాటు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది. దీంతో రిజర్వేషన్లు అనుకూలించని వారు నిరుత్సాహంతో ఉండగా అనుకూలించిన వారు పోటీకి సిద్ధం అవుతున్నారు.
షెడ్యూల్ విడుదల
జెడ్పీటీసీ, ఎంపీటీసీతోపాటు గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ షెడ్యూల్ సోమవారం వచ్చింది. మొదటి విడత అక్టోబర్ 9న ఎన్నికల నోటిఫికేషన్, ఓటరు జాబితా ప్రకటనతో మొదలై అక్టోబర్ 23న పోలింగ్ జరుగుతుంది. రెండో విడత అక్టోబర్ 13న నోటిఫికేషన్, ఓటరు జాబితాతో మొదలై అక్టోబర్ 27న పోలింగ్ జరుగుతుంది. రెండు విడతల ఓట్ల లెక్కింపు నవంబర్ 11న జరిపి ఫలితాలు విడుదల చేస్తారు. అదే విధంగా సర్పంచ్ ఎన్నికలకు అక్టోబర్ 17న నోటిఫికేషన్, ఓటరు జాబితా ప్రకటనతో మొదలై అక్టోబర్ 31న పోలింగ్, అదే రోజు లెక్కింపు ఉంటుంది. రెండో విడత అక్టోబర్ 21న నోటిఫికేషన్‌తో మొదలై నవంబర్ 4వ తేదీన ఓట్ల లెక్కింపు, ఫలితాల విడదల చేస్తారు. మూడో విడత అక్టోబర్ 25న నోటిఫికేషన్‌తో మొదలై.. నవంబర్ 8వ తేదీన పోలింగ్ అదే రోజు లెక్కింపు ఉంటుంది.
రెండు విడతల్లో జెడ్పీటీసీ,
ఎంపీటీసీ ఎన్నికలు
జిల్లాలోని మహబూబాబాద్, తొర్రూరు రెవెన్యూ డివిజన్ల పరిధిలోని 18 మండలాల్లో ఉన్న జెడ్పీటీసీలతోపాటు 193 ఎంపీటీసీ స్థానాలకు రెండు విడతలుగా ఎన్నికలు జరుగుతాయి. మొదటి విడత బయ్యారం, చిన్నగూడూరు, దంతాలపల్లి, గార్ల, గూడూరు, మహబూబాబాద్, నర్సింహులపేట, పెద్దవంగర, తొర్రూరు మండలాలాల్లో ఎన్నికలు జరుగుతాయని తెలిసింది. అలాగే రెండో విడతలో డోర్నకల్, గంగారం, ఇనుగుర్తి, కేసముద్రం, కొత్తగూడ, కురవి, మరిపెడ, నెల్లికుదురు, సీరోలు మండలాల్లో ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు సర్వం సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది.
మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలు
జిల్లాలోని 482 గ్రామ పంచాయితీలకు సర్పంచ్‌లు, 4,110 వార్డులకు ఎన్నికలు జరుగుతాయి. కాగా మొదటి విడత అక్టోబర్ 31న బయ్యారం, చిన్నగూడూరు, దంతాలపల్లి, గార్ల, నర్సింహులపేట, పెద్దవంగర, తొర్రూరు మండలాల్లో ఎన్నికలు జరుగుతాయని సమాచారం. నవంబర్ 4న డోర్నకల్, గంగారం, కొత్తగూడ, కురవి, మరిపెడ, సీరోలు మండలాల్లో రెండో విడత పోలింగ్ జరగనున్నట్లు తెలిసింది. నవంబర్ 8న గూడూరు, ఇనుగుర్తి, కేసముద్రం, మహబూబాబాద్, నెల్లికుదురు మండలాల్లో మూడో విడత ఎన్నికలు జరిపేందుకు అధికారులు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
రెండు విడతల్లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు
మూడు విడతల్లో సర్పంచ్, వార్డుల సభ్యుల ఎలక్షన్స్
సర్పంచ్ ఎన్నికల రోజే ఫలితాలు
నవంబర్ 11న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఓట్ల లెక్కింపు