
పూలతో ప్రకృతిని పూజించే గొప్ప పండుగ..
సద్దుల బతుకమ్మ వేడుకలకు హాజరైన ఎమ్మెల్యే భూక్య మురళీ నాయక్ మాట్లాడుతూ.. బతుకమ్మ వేడుకలకు తగిన ఏర్పాట్లు చేశామన్నారు. అక్టోబర్ 2న దసరా పండుగ జిల్లా కేంద్రంలోని హనమంతుని గడ్డలో నిర్వహిస్తామని, కుటుంబ సభ్యులతో మహిళలు, చిన్నారులు తరలిరావాలన్నారు. బతుకమ్మ మహిళలకు ఎంతో ఇష్టమైన పండుగన్నారు. మహిళలు దుర్గాదేవి, పార్వతీ దేవతలను భక్తి శ్రద్ధలతో పూజిస్తారని, ఎక్కువ శక్తిని ఇచ్చే దేవతలను మహిళలు ఆరాధిస్తారన్నారు. అనంతరం ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్‌రావు మాట్లాడుతూ.. మహిళలను గౌరవిస్తూ వారి ఔన్నత్యాన్ని చాటిచెప్పే గొప్ప పండుగ బతుకమ్మ అన్నారు. పేద, ధనిక తేడా లేకుండా మహిళలందరూ సుఖఃసంతోషాలతో సద్దుల బతుకమ్మను జరుపుకుంటారన్నారు. మహిళలు ఆరోగ్యంగా ఉంటే కుటుంబం ఆరోగ్యంగా, సంతోషంగా ఉంటుందన్నారు. అనంతరం బతుకమ్మ పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ఎడ్ల రమేష్, ఖలీల్, పోతురాజురాజు, బొల్లు రాజు, మంగళపల్లి కన్న, నిమ్మల శ్రీనివాస్, శ్యామ్, ప్రవీణ్, డీఎస్పీ తిరుపతిరావు, సీఐ మహేందర్‌రెడ్డి, ఎస్సైలు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
కురవి పెద్ద చెరువు కట్టపైకి బతుకమ్మలతో వెళ్తున్న మహిళలు