
ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్ ఎదుట వర్కర్ల భిక్షాటన
మరిపెడ: డైలీవేజ్ వర్కర్లకు టైంస్కేల్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మరిపెడలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముందు డైలీవేజ్, కాంటినెంట్, పార్ట్‌టైం వర్కర్లు మోకాళ్లపై నిల్చొని భిక్షాటన చేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి బి.మధు మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసి గెలిపిస్తే పండుగపూట పస్తులు ఉండేలా చేశారన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కార్మికుల్ని పర్మినెంట్ చేస్తామని చెప్పి మా ఓట్లు దండుకున్నారన్నారు. ఐదేళ్ల సర్వీస్ ఉన్నవారందరనీ రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. నల్లగొండ జిల్లాలో ఇస్తున్న విధంగా టైం స్కేల్ ఇవ్వాలన్నారు. పెండింగ్ వేతనాలు తక్షణమే చెల్లించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో డైలీ వర్కర్స్ యూనియన్ జేఏసీ జిల్లా అధ్యక్షుడు గుగులోతు రవీందర్‌నాయక్, కార్యదర్శి తాజుద్దీన్, జితేందర్, ముత్తయ్య, లింగన్న, శోభ, మంగమ్మ, సురేష్, సోమన్న, నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.