
మైసూర్ ఉత్సవాలను తలపించేలా దసరా వేడుకలు
ఖిలా వరంగల్: వరంగల్ ఉర్సు రంగలీల మైదానంలో ప్రభుత్వ యంత్రాంగం, ఉత్సవ కమిటీ సంయుక్త ఆధ్వర్యంలో అక్టోబర్ 2న నిర్వహించనున్న దసరా ఉత్సవాలను మైసూర్ ఉత్సవాలను తలపించేలా ఘనంగా నిర్వహిస్తామని ఉత్సవ కమిటీ అధ్యక్షుడు నాగపూరి సంజయ్‌బాబు గౌడ్ అన్నారు. వరంగల్ కరీమాబాద్‌లోని ఆదర్శ పరపతి సంఘం భవనంలో ప్రధాన కార్యదర్శి మేడిది మధుసూదన్, కోశాధికారి మండ వెంకన్న, ఉపాధ్యక్షుడు గోనె రాంప్రసాద్ అధ్యక్షతన సోమవారం జరిగిన సమావేశంలో సంజయ్‌బాబు మాట్లాడుతూ పూర్వీకుల నుంచి రంగలీల మైదానంలో రావణవధ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు గుర్తుచేశారు. మంత్రి కొండా సురేఖ, కలెక్టర్ సత్యశారద ఆదేశాల మేరకు ప్రభుత్వ యంత్రాంగం ఏర్పాట్లలో నిమగ్నమైందన్నారు. ఉత్సవాలను ప్రజలు విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో ఉత్సవ కమిటీ ప్రతినిధులు శివమూర్తి, ట్రస్ట్ చైర్మన్ వంగరి కోటేశ్వర్, రంజిత్‌గౌడ్, సందీప్, వెంకటేశ్వర్లు, వేణుగోపాల్, అఖిల్‌గౌడ్, పూజారి అజయ్, సంజీవ్, వాసు, అశోక్, బిట్ల క్రాంతి, మహేశ్, శ్రీను, గోవర్ధన్, చిరంజీవి, రంజిత్, వంశీ, నాగరాజు, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.