
భద్రకాళి అమ్మవారికి భద్రపీఠసేవ, అశ్వవాహన సేవ
హన్మకొండ కల్చరల్: భద్రకాళి దేవాలయంలో జరుగుతున్న శరన్నవరాత్ర ఉత్సవాల్లో భాగంగా ఎనిమిదో రోజు సోమవారం అమ్మవారిని సరస్వతీదేవిగా అలంకరించారు. ఆలయ ప్రధానార్చకుడు శేషు ఆధ్వర్యంలో అర్చకులు నిత్యాహ్నికం నిర్వహించారు. ఉదయం అమ్మవారిని కాళరాత్రి క్రమంలో దుర్గార్చన జరిపి భద్రపీఠ సేవ నిర్వహించారు. సాయంత్రం అశ్వవాహనసేవ నిర్వహించారు. ఆలయ ఈఓ రామల సునీత, ధర్మకర్తలు తొనుపునూరి వీరన్న, రాములు, శ్రవణ్‌రెడ్డి, అంజేయులు, వెంకటేశ్వర్లు, శ్రీనివాసరావు, మూగ శ్రీనివాస్‌రావు పర్యవేక్షించారు.