
చెత్త తీయట్లేదు..
మా బజారులో పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని మున్సిపాలిటీ సిబ్బంది ట్రాక్టర్లలో తీసుకుపోవట్లేదు. ఇప్పటి వరకు మా బజారుకు ట్రాక్టర్ రాలేదు. మున్సిపాలిటీ అయ్యాక అసలు అధికారులు ఎవరో అర్థం కావడంలేదు. సైడ్‌కాల్వలను శుభ్రం చేయకపోవడంవల్ల దుర్వాసనతోపాటు, దోమలు విపరీతంగా పెరిగిపోయాయి. రాత్రిళ్లు కంటిమీద కునుకులేకుండా పోతుంది. ఇప్పటికై నా చెత్తాచెదారాన్ని తీసుకెళ్లడంతో పాటు సైడ్ కాల్వలను శుభ్రపరచాలి. వీధి లైట్లు ఏర్పాటు చేయాలి.
– మేకల వెంకన్న, కేసముద్రం విలేజ్