
మానుకోటను బంగారుకోటగా తీర్చిదిద్దుతా
మహబూబాబాద్ అర్బన్: మానుకోట మున్సిపాలిటీని బంగారు కోటగా తీర్చిదిద్దుతానని ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళీనాయక్ అన్నారు. మానుకోట మున్సిపాలిటీ పరిధి ఈదులపూసపల్లి ఒకటో వార్డులో సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలో మానుకోట మున్సిపాలిటీ పరిధి విలీన గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించి, సీసీ రోడ్లు వేస్తున్నామన్నారు. రానున్న రోజుల్లో మరిన్ని నిధులతో మానుకోటను అభివృద్ధి పథంలో ముందు ఉంచుతామన్నారు. కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ వెన్నం లక్ష్మారెడ్డి, నాయకులు గోవర్ధన్ రెడ్డి, బావ్ సింగ్, వెంకన్న, వినయ్ తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్