
గుట్టలెక్కి.. వైద్యం చేసి
వాజేడు: గుట్టలపై ఉన్న పెనుగోలు గ్రామానికి వెళ్లి ఆదివాసీలకు వైద్యం చేయడం మధురానుభూతినిస్తుందంటున్నారు వాజేడు వైద్యాధికారి మధుకర్. ఏడాది క్రితం వాజేడు వైద్యాధికారిగా వచ్చిన తొలి రోజుల్లో సిబ్బందితో కలిసి మండల పరిధి కొంగాల గ్రామ పంచాయతీ గుట్టలపై పెనుగోలు గ్రామానికి కాలినడకన వెళ్లారు. వాగులు వంకలు దాటుతూ అప్‌అండ్ డౌన్ 34 కిలో మీటర్ల నడిచారు. మారుమూల గ్రామాల ప్రజలకు సైతం ప్రభుత్వ వైద్యం అందాలని, వారికి సేవ చేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నట్లు మధుకర్ చెబుతున్నారు.

గుట్టలెక్కి.. వైద్యం చేసి