
ప్రభుత్వం హామీలను అమలు చేయాలి
మహబూబాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర కార్యదర్శి వీరస్వామి, జేఏసీ నాయకుడు డోలి సత్యనాయణ డిమాండ్ చేశారు. ఫోరం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సోమవారం తహసీల్దార్ కా ర్యాలయం ఎదుట ఒకరోజు శాంతియుత దీక్ష నిర్వహించారు. వారు మాట్లాడుతూ.. ఉద్యమకారులకు 250గజాల స్థలంతో పాటు రూ.25,000 పింఛన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఉద్యమకారులకు గత ప్రభుత్వం తీరని అన్యాయం చేసిందని, కాంగ్రెస్ ప్రభుత్వం అయినా న్యాయం చేయాలన్నారు. ఉద్యమకారులలో విద్యార్హత ఉన్న వారికి ఉద్యోగాలు ఇవ్వాలన్నారు. ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలన్నారు. దీక్షకు డాక్టర్ నెహ్రూనాయక్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్లు మార్నేని వెంకన్న, ఫరీద్, టీఎన్జీఓఎస్ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్, బానోత్ రవికుమార్‌తో పాటు పలువురు సంఘీభావం తెలి పారు. దీక్షలో వెంకటేశ్వర్లు, శ్రీనివాస్‌రెడ్డి, వహీద్, హనుమంత్, గోపాల్, వీరభద్రం ఉన్నారు.