
చి(చె)త్త శుద్ధి ఏది..
సోమవారం శ్రీ 30 శ్రీ జూన్ శ్రీ 2025
– 8లోu
సాక్షి, మహబూబాబాద్:
వానాకాలం.. అధికంగా వ్యాధులు ప్రబలే అవకాశం ఉంటుంది. డెంగీ, చికెన్ గున్యా, టైపాయిడ్, మలేరియా, ఫైలేరియా వంటి సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందుతాయి. కాగా ఎప్పటికప్పుడు పారిశుద్ధ్య పనులు చేపట్టడం, డ్రెయినేజీల్లో చెత్త సేకరించి, బ్లీచింగ్ చల్లడం వంటి చర్యల ద్వారా దోమల వృద్ధిని అరికట్టి, సీజనల్ వ్యాధుల తీవ్రతను తగ్గించే అవకాశం ఉంటుంది. అయితే జిల్లాలోని మున్సిపాలిటీల్లో ఎక్కడి చెత్త అక్కడే పేరుకుపోయి.. డ్రెయినేజీలు దుర్వాసనను వెదజల్లుతున్నాయి. దీంతో పలువురు సీజనల్ వ్యాధు ల బారినపడి ఆస్పత్రుల బాటపడుతున్నారు. ఆదివారం ‘సాక్షి’ పరిశీలనలో పలు సమస్యలు వెలుగులోకి వచ్చాయి.
‘ఈ ఫొటోలో కనిపిస్తున్నది మహబూబాబాద్ కొత్త బస్టాండ్ ఏరియా వివేకానంద విగ్రహానికి సమీపంలోని గోపాల్ రెడ్డి కాంప్లెక్స్ ప్రాంతంలో పేరుకుపోయిన చెత్త. ఈ ప్రాంతంలో నివాస గృహాల నుంచి రోజువారి చెత్త సేకరించడం లేదు. దీంతో ఇళ్లలోని చెత్తను అందరు ఒకేచోట పోస్తున్నారు. దీంతో ఆ ప్రాంతంలో చెత్త కుప్ప తయారైంది. తడి, పొడి చెత్త కలిసి ఉండడంతో చెత్త కుళ్లిపోయి దుర్వాస వస్తోందని స్థానికులు చెబుతున్నారు.’
న్యూస్‌రీల్
మూడు రోజులకోసారి సేకరణ
పందులు, కుక్కలతో పరేషాన్
వానాకాలం వస్తే అంతా దుర్వాసన
సిబ్బంది కొరత, మరమ్మతుల్లోవాహనాలు

చి(చె)త్త శుద్ధి ఏది..

చి(చె)త్త శుద్ధి ఏది..