
గంజాయి స్వాధీనం చేసుకుంటున్న పోలీసులు
● పోలీసుల అదుపులో నిందితుడు
రఘునాథపల్లి: రైలులో గంజాయి తరలిస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని 23.860 కిలోల సరుకును స్వాధీనం చేసుకున్నారు. జార్ఖండ్ రాష్ట్రం థానేలోని కై లాస్ అపార్ట్‌మెంట్‌లో నివసించే మనోజ్ శ్యామ్‌దేవ్‌షా శుక్రవారం సిర్పూర్ కాగజ్‌నగర్ నుంచి సికింద్రాబాద్ వెళ్లే భాగ్యనగర్ రైలులో రూ 5.96 లక్షల విలువైన గంజాయి తీసుకెళ్తూ మార్గమధ్యలో రఘునాథపల్లి రైల్వే స్టేషన్‌లో దిగాడు. దీనిపై సమాచారం అందుకున్న ఆర్‌పీఎఫ్, వరంగల్ టాస్క్‌ఫోర్స్, రఘునాథపల్లి పోలీసులు మనోజ్ శ్యామ్‌దేవ్‌షా అదుపులోకి తీసుకుని గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై చాగర్ల రఘుపతి తెలిపారు. కార్యక్రమంలో ఎస్సై, స్పెషల్ స్క్వాడ్ సభ్యులు, ఎంపీడీఓ హసీం, సిబ్బంది ఉన్నారు. కాగా, మనోజ్ శ్యామ్‌దేవ్‌షా గంజాయిని ముంబై తరలిస్తున్న క్రమంలో పోలీసులకు పట్టుబడ్డాడు.
