మయూర వాహనంపై మురిసిన ఆదిదంపతులు | - | Sakshi
Sakshi News home page

మయూర వాహనంపై మురిసిన ఆదిదంపతులు

Oct 13 2026 1:59 AM | Updated on Oct 13 2026 1:59 AM

శ్రీశైలంటెంపుల్‌: అష్టాదశ శక్తిపీఠమైన శ్రీశైల మహాపుణ్యక్షేత్రంలో దేవి శరన్నవరాత్రులు శాస్త్రోక్తంగా కొనసాగుతున్నాయి. రెండవ రోజు సోమవారం శ్రీశైల భ్రామరీ బ్రహ్మచారిణి స్వరూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామిఅమ్మవార్లు మయూర వాహనంపై దర్శనమిచ్చారు. గంగాధర మండపం నుంచి నంది మండపం, అక్కడి నుంచి బయలువీరభద్రస్వామి ఆలయం వరకు గ్రామోత్సవాన్ని నిర్వహించారు. గ్రామోత్సవంలో కళాకారుల నృత్యాలు, డప్పు వాయిద్యాలు ప్రత్యేక అకర్షణగా నిలిచాయి. స్వామి అమ్మవార్లను భక్తులు దర్శించి ప్రత్యేక పూజలు చేశారు. పూజా కార్యక్రమాల్లో దేవస్థాన ధర్మకర్తల మండలి అధ్యక్షులు పోతుగుంట రమేష్‌నాయుడు, కార్యనిర్వహణాధికారి శ్రీనివాసరావు దంపతులు పాల్గొన్నారు. దసరా నవరాత్రోత్సవాల్లో భాగంగా మంగళవారం చంద్రఘంట అలంకారంలో అమ్మవారు, రావణ వాహనసేవపై స్వామిఅమ్మవార్లు దర్శనమివ్వనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement