పింఛన్‌ ఇచ్చి ఆదుకోండి | - | Sakshi
Sakshi News home page

పింఛన్‌ ఇచ్చి ఆదుకోండి

Oct 13 2026 1:59 AM | Updated on Oct 13 2026 1:59 AM

పింఛన్‌ ఇచ్చి ఆదుకోండి పుట్టుక నుంచే రెండు చెవులు వినబడవు

కూలీ పనులకు వెళ్లి కుటుంబాన్ని పోషించే నాకు వెన్నుపూస పూర్తిగా విరిగిపోయింది. మంచానికే పరిమితం అయ్యాను. ఏ పనీ చేసుకోలేను. నాకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. వారంతా కూలీ పనులకు పోవాల్సి వస్తోంది. దయ చేసి నాకు పింఛన్‌ ఇచ్చి ఆదుకోవాలి.

– దిద్దికాటి రంగన్న, పలుకుల దొడ్డి, సీబెళగల్‌ మండలం

నాకు పుట్టుకతోనే రెండు చెవులు వినబడవు. నేను ఎక్కడికై నా వెళ్లాలంటే ఒకరు తోడు ఉండాలి. స్థిరాస్తులు లేకపోవడంతో భార్యతో కలసి కూలీ పనులకు వెళ్తాను. సదరం క్యాంపులో నాకు 25 శాతం వికలత్వం ఉన్నట్లు సర్టిఫికెట్‌ ఇచ్చారు. ఫలితంగా వికలాంగ పింఛన్‌ రావడంలేదు. నా పరిస్థితిని అర్థం చేసుకొని పింఛన్‌ ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలి.

– దాసిర తలారి పెద్ద వీరన్న, కోడుమూరు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement