● 2020 సంవత్సరంలో కర్నూలు కార్పొరేషన్ ఎన్నికలు నిర్వహించగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అఽభ్యర్థులు 42 మంది విజయం సాధించారు.
● మేయర్ బివై రామయ్య అధ్యక్షతన ఐదేళ్లు విజయవంతంగా పాలక వర్గాన్ని నడిపించారు.
● ఓ మంత్రి వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లకు ఎరవేసి మేయర్‌ను దించాలని చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి.
● వైఎస్సార్‌సీపీ పాలకవర్గంలో రూ.650 కోట్లకు పైగా అభివృద్ధి పనులు చేపట్టింది.
● శుద్ధి చేసిన మంచినీటిని అందించేందుకు మునగాలపాడు వద్ద రూ.5 కోట్లు వెచ్చించి 15 ఎంఎల్‌డీ ప్లాంటు, రూ.68 కోట్లతో సుంకేసుల నుండి సమ్మర్ స్టోరేజీ ట్యాంకు వరకు పైపులైన్, రూ. 28 కోట్లతో నూతనంగా నగరపాలక సంస్థ కార్యాలయ భవనం, నగరంలోని పలు ప్రాంతాల్లో రూ.2 కోట్లు వెచ్చించి ఆహ్లాదకరమైన వాతవరణం, గ్రీనరీకి ప్రాధాన్యత ఇస్తు పార్కులు నిర్మించారు.
● రూ.2.30 కోట్లు వెచ్చించి జొహరాపురం వద్ద ఇండోర్ స్టేడియం, క్రికెట్ నెట్స్, టెన్నిస్ స్టేడియాలు.. రూ.2 కోట్లు ఖర్చు చేసి ఖానా ఖాజానా పేరిట స్ట్రీట్ ఫుడ్ అందుబాటులోకి తీసుకొచ్చారు.
● రోడ్లపై, ఫుట్ పాత్‌లపై వ్యాపారాలు చేసుకుంటూ ట్రాఫిక్‌కు అంతరాయం కలిగిస్తుండటంతో వారి కోసం రూ.30 లక్షలు వెచ్చించి వినాయక్‌ఘాట్, బిర్లా వాల్ మార్ట్ వద్ద, క్రిష్ణనగర్ ఐటీసీ సర్కిల్ వద్ద, గుత్తి పెట్రోల్ బంకు వద్ద ప్రత్యేకంగా స్ట్రీట్ మార్కెట్లను ఏర్పాటు చేశారు.
● గడప గడపకు పేరుతో స్థానికంగా కాలనీల సమస్యల పరిష్కారానికి రూ. 60 కోట్లు ఖర్చు చేశారు.
● జగనన్న మార్టుల ద్వారా పేద, సామాన్య మధ్య తరగతి ప్రజలకు నిత్యావసర సరుకు లు ఎంఆర్‌పీ కన్నా తక్కువకు అందించారు.
● రహదారుల విస్తరణ, సర్కిళ్ల ఏర్పాటు, మౌ లిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేశారు.


