కున్నూరులో పోలీసుల సోదాలు | - | Sakshi
Sakshi News home page

కున్నూరులో పోలీసుల సోదాలు

Oct 13 2026 1:59 AM | Updated on Oct 13 2026 1:59 AM

గోనెగండ్ల: మండలంలోని కున్నూరు గ్రామంలో పోలీసులు సోమవారం ఉదయం కార్డెన్‌ సెర్చ్‌ నిర్వహించారు. ఎమ్మిగనూరు డీఎస్పీ ఆముదాల శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో గోనెగండ్ల సీఐ చంద్రబాబు, ఎమ్మిగనూరు ఎస్‌ఐ శ్రీనివాసులు, నందవరం ఎస్‌ఐ తిమ్మారెడ్డి, 30 మంది పోలీస్‌ కానిస్టేబుల్స్‌ కున్నూరు గ్రామానికి వెళ్లి అనుమనిత వ్యక్తుల ఇళ్లలో సోదాలు చేశారు. నంబర్‌ ప్లేట్స్‌ లేని 12 ద్విచక్ర వాహనాలను గుర్తించి వాటిని స్వాధీనం చేసుకున్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని, గొడవలు సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

జార్ఖండ్‌ యువకుడి మృతి

బేతంచెర్ల: గూటుపల్లె గ్రామ సమీపాన ఉన్న సుంకులమ్మ ఆలయం వద్ద నీటి ట్యాంకర్‌తో వస్తున్న ట్రాక్టర్‌ బోల్తాపడిన ప్రమాదంలో జార్ఖండ్‌ రాష్ట్రానికి చెందిన హర్ధన్‌ ముర్ము (24) అనే యువకుడు మృతి చెందాడు. ఎస్‌ఐ రమేష్‌ బాబు తెలిపిన వివరాల మేరకు.. ఏకోరన్‌ సంస్థలో ట్రాక్టర్‌ డ్రైవర్‌గా పనిచేస్తున్న హర్ధన్‌ ముర్ము పని ప్రదేశం నుంచి నీటి ట్యాంకర్‌తో వస్తుండగా ట్రాక్టర్‌ ప్రమాదవశాత్తు బోల్తా పడింది. తీవ్రగాయాల పాలైన హర్ధన్‌ముర్ము అక్కడికక్కడే మరణించాడు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ సోమవారం తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement