కర్నూలు(అగ్రికల్చర్): కర్నూలు జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలకు చెందిన మహిళలకు కెనరా బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణా సంస్థ ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు ఈ సంస్థ డైరెక్టర్ కే.పుష్పక్ తెలిపారు. కొవ్వొత్తుల తయారీలో 12 రోజులు, జూట్ బ్యాగుల తయారీలో 14 రోజులు ఉచితంగా శిక్షణ ఇస్తున్నట్లు ఆయన బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 17వ తేదీ నుంచి శిక్షణ మొదలవుతుందని పేర్కొన్నారు.19 నుంచి 50 ఏళ్లలోపు వయస్సు మహిళలు అర్హులని, తెలుగులో చదవడం, రాయడం వచ్చి ఉండాలని, శిక్షణా కాలంలో ఉచిత భోజనం, హాస్టల్ వసతి కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తి కలిగిన వారు నాలుగు ఫొటోలు, రేషన్‌కార్డు, ఆధార్, బ్యాంకు ఖాతా, విద్యార్హత ధ్రువపత్రాల జిరాక్స్ కాపీలతో సంస్థ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పూర్తి వివరాలకు కర్నూలు శివారు బి.తాండ్రపాడు సమీపంలోని కెనరా బ్యాంకు– గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణా సంస్థ (డీఆర్‌డీఏ–టీటీడీసీ పక్కన)లో సంప్రదించవచ్చన్నారు. అలాగే 08518–273710, 85002 72720, 90007 10508, 94409 05477 నంబర్లకు ఫోన్ చేయవచ్చని తెలిపారు.
వైద్య విద్యార్థినుల గదుల వద్దకు ఆగంతకులు
కర్నూలు(హాస్పిటల్): కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో మహిళా హౌస్ సర్జన్ల వసతి గదుల వద్దకు మంగళవారం రాత్రి ఆగంతకు లు రావడంతో కలకలం రేగింది. ఆసుపత్రి లో ని పేయింగ్ బ్లాక్ పై అంతస్తులో ఉన్న హౌస్ సర్జన్ల గది వద్దకు అర్ధరాత్రి దాటాక ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు వచ్చి తలుపులు కొట్టారు. తలుపులు తెరిచి చూడగా గుర్తుతెలియని వ్యక్తులు కనిపించే సరికి వైద్య విద్యార్థినులు భయాందోళనకు గురయ్యారు. ఎవరు మీరని ప్రశ్నించగా గతంలో ఇక్కడ క్యాన్సర్ వార్డు ఉంది కదా అందుకే వచ్చామని మద్యం మత్తులోపొంతనలేని సమాధానాలు చెప్పారు. దీనిపై వైద్య విద్యార్థినులు ఆసుపత్రి అధికారులకు సమాచారం ఇవ్వగా, వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే వసతి గృహం వద్దకు చేరుకున్న పోలీసులు ఇద్దరు ఆగంతకులను అదుపులోకి తీసుకుని మూడవ పట్టణ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. వారిలో ఒకరు న్యాయవాది, మరికరు విలేకరి అని చెప్పినట్లు సమాచారం. వైద్య విద్యార్థినుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు.
కర్నూలు(సెంట్రల్): నూతన పింఛన్ కోసంవచ్చిన దరఖాస్తులను సెప్టెంబర్ 21వ తేదీలోపు పరిశీలన చేసి ఎంపీడీఓ లాగిన్లకు పంపాలని అధికారులను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి ఆదేశించారు. అర్హత కలిగిన వాటినే మాత్రమే ఆమోదించాలని, అర్హత లేని వాటని తిరస్కరించాలన్నారు. బుధవారం టెలీకాన్ఫరెన్స్ ద్వారా అధికారులతో ఆమె సమీక్షించారు. పింఛన్ల కోసం జిల్లాలో ఇప్పటివరకు 41,000కు పైగా దరఖాస్తులు వచ్చినట్ల తెలిపారు. పింఛన్ల దరఖాస్తులను 21 నుంచి 24వ తేదీ వరకు ఎంపీడీఓలు పరిశీలించి నేరుగా సెర్ప్ సీఈఓకు పంపించాలన్నారు. టెలీకాన్ఫరెన్స్‌లో డీఆర్‌డీఏ పీడీశ్రీధర్ రావు, స్వర్ణ గ్రామ స్వర్ణ అవార్డు జిల్లా అధికారి భాస్కర్ నాయుడు, సోషల్ వెల్ఫేర్ డీడీ రాధిక, హ్యాండ్లూమ్స్ ఏడీ నాగరాజు నాయుడు, మత్స్యశాఖ డీడీ రంగనాథ్ బాబు, ఎకై ్సజ్ సూపరింటెండెంట్ సుధీర్ బాబు పాల్గొన్నారు.
ఇసుక అక్రమ తవ్వకాలపై
కఠిన చర్యలు
ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణాపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశం నిర్వహించారు. ఇసుక రీచ్‌లు, స్టాక్ పాయింట్లను ఆర్డీఓలు, ఇతర అధికారులు తరచూ తనిఖీ చేయాలన్నారు. ఏప్రిల్ 2026 నుంచి ఇప్పటివరకు 80 వాహనాలను సీజ్ చేసి రూ.18,45,360 జరిమానా విధించినట్లు గనుల శాఖ డీడీనాగిని చెప్పారు. సమావేశంలో జేసీ నూరుల్ ఖమర్, కర్నూలు, ఆదోని, పత్తికొండ ఆర్డీవోలు కె. సందీప్ కుమార్, అరుణ దేవి, ఓబులేసు, డీటీసీ శాంతకుమారి, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఈఈ కిషోర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కర్నూలు కల్చరల్: బీఈడీ నాల్గో సెమిస్టర్ రీ వాల్యుయేషన్ ఫలితాలను విడుదల చేశారు. రాయలసీమ యూనివర్సిటీ వైస్‌చాన్సలర్ ప్రొఫెసర్ వి.వెంకట బసవరావు ఆదేశాల మేరకు ఫలితాలను విడుదల చేసినట్లు వర్సిటీ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ ఎస్.వెంకటేశ్వర్లు తెలిపారు. ఫలితాలను https:// rayalseemauniversity.ac.in అనే వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. మొత్తం 430 మంది విద్యార్థులు 526 పేపర్స్‌కు రీ వాల్యుయేషన్‌కు దరఖాస్తు చేసుకోగా 312 మంది 367 పేపర్లలో ఉత్తీర్ణులైనట్లు పేర్కొన్నారు.


