● సీఐ కారులోని మద్యం బాటిళ్లను పోలీసులు తీసేశారంటూ ఆరోపణలు ● దెబ్బతిన్న రెండు వాహనాలు | - | Sakshi
Sakshi News home page

● సీఐ కారులోని మద్యం బాటిళ్లను పోలీసులు తీసేశారంటూ ఆరోపణలు ● దెబ్బతిన్న రెండు వాహనాలు

Sep 17 2026 1:44 AM | Updated on Sep 17 2026 1:44 AM

● సీఐ కారులోని మద్యం బాటిళ్లను పోలీసులు తీసేశారంటూ ఆరోపణలు ● దెబ్బతిన్న రెండు వాహనాలు

భక్తుల వాహనాన్ని ఢీకొట్టిన ఎకై ్సజ్‌ సీఐ కారు

గోనెగండ్ల: స్థానిక విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ సమీపంలో మంగళవారం రాత్రి ఎమ్మిగనూరు ఎకై ్సజ్‌ సీఐ రమేష్‌ రెడ్డి నడుపుతున్న కారు కర్ణాటక భక్తులు ప్రయాణిస్తున్న తుపాన్‌ వాహనంను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రెండు వాహనాలు దెబ్బతిన్నాయి. వివరాలు.. కర్ణాటకలోని సిరుగుప్ప ప్రాంతానికి చెందిన భక్తులు తుపాన్‌ (ఏకే 36 ఎన్‌ 5715) వాహనంలో రెండు రోజుల క్రితం శ్రీశైలం వెళ్లి స్వామిఅమ్మవార్లను దర్శించుకున్నారు. మంగళవారం కర్ణాటకకు తిరుగుప్రయాణమయ్యారు. అలాగే ఎమ్మిగనూరు ఎకై ్సజ్‌ సీఐ రమేష్‌ రెడ్డి రాత్రి ఎమ్మిగనూరు నుంచి ఏపీ 39 కేఈ 2647 నంబరుగల కారులో కర్నూలుకు బయలుదేరారు. గోనెగండ్ల విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌ సమీపంలోకి రాగానే సీఐ ప్రయాణిస్తున్న కారు అతి వేగంగా తుపాన్‌ వాహనాన్ని ఢీకొట్టింది. ప్రమాద సమయంలో ఎయిర్‌ బ్యాగ్‌ తెరుచుకోవడంతో సీఐ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. తుపాన్‌ వాహనంలోని వారికి స్వల్ప గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న గోనెగండ్ల పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. ఎకై ్సజ్‌ సీఐ అతివేగంగా కారు డ్రైవ్‌ చేస్తూ వచ్చి ఢీకొట్టినట్లు తుపాన్‌లో ఉన్న వారు ఆరోపిస్తున్నారు. సీఐ మద్యం సేవించి వాహనం నడిపినట్లు ఆరోపణలు ఉన్నాయి. ప్రమాదంలో స్వల్పంగా గాయపడిన సీఐను గోనెగండ్ల పోలీసులు విచారణ చేసి పంపినట్లు తెలిసింది. సీఐ కారులో కవర్‌లో ఉన్న మద్యం సీసాలను పోలీసులు వేరే వాహనంలోకి మార్చినట్లు స్థానికులు చర్చించుకుంటున్నారు. ఈ విషయంపై గోనెగండ్ల సీఐ చంద్రబాబు మాట్లాడుతూ.. రెండు వాహనాలు ఢీకొన్న ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదు. ప్రమాద ఘటనపై విచారించి తగు చర్యలు తీసుకుంటామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement