దొర్నిపాడు: ప్రస్తుతం మార్కెట్లో పశువుల ఎరువులతో పండించిన కూరగాయలు, పండ్లకు గిరాకీ ఉంది. దీంతో పశువుల ఎరువుకు డిమాండ్ ఏర్పడింది. ట్రాక్టరు ట్రిప్పు ఎరువు ఏకంగా రూ.10 వేల నుంచి రూ.15వేల వరకు పలుకుతోంది. దొర్నిపాడు పరిసర ప్రాంతాల నుంచి చాలా మంది వ్యాపారులు ఇక్కడ పాడి రైతుల వద్ద ట్రాక్టరు ఎరువును రూ.3 వేలకు కొనుగోలు చేసి తాడిపత్రి, అనంతపురం ప్రాంతాలకు తీసుకెళ్లి విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. పశువుల ఎరువుల తో సహజంగా పండిస్తున్న సపోట, చీని, దానిమ్మ, బొప్పాయి, అలాగే కూరగాయలు మంచివంటూ వినియోగదారులకు వ్యాపారులు అమ్ముతున్నారు.


