మార్చురీకి సిబ్బంది కేటాయింపు | - | Sakshi
Sakshi News home page

మార్చురీకి సిబ్బంది కేటాయింపు

May 13 2026 1:20 AM | Updated on May 13 2026 1:20 AM

మార్చురీకి సిబ్బంది కేటాయింపు

కర్నూలు(హాస్పిటల్‌): కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల ఆవరణలోని మార్చురీకి అవసరమైన సిబ్బందిని కేటాయిస్తూ మంగళవారం కర్నూలు మెడికల్‌ కాలేజీ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ కె.చిట్టినరసమ్మ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 9న ‘మార్చురీలో రాబందులు’ శీర్షికన ప్రచురించిన కథనానికి ఆమె స్పందించి ఈ నిర్ణయం తీసుకున్నారు. మార్చురీలో ప్రభుత్వ సిబ్బంది లేకపోవడంతో అనధికార వ్యక్తులు వచ్చి పోస్టుమార్టం విధులు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు వీరి స్థానంలో కళాశాలలో పనిచేసే ఇద్దరు శానిటేషన్‌ వర్కర్లు, నలుగురు సెక్యూరిటీ గార్డులు, నలుగురు తోటీలు, ఒక ఆఫీస్‌ సబార్డినేట్‌ను కేటాయించారు.

Advertisement
 
Advertisement
Advertisement