శ్రీశైలంటెంపుల్: శ్రీశైల శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్లను శ్రీశైల జగద్గురు పీఠాధిపతి చెన్నసిద్దరామ పండితారాధ్య శివాచార్య మహాస్వామి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. గురువారం మల్లన్న దర్శనార్థం విచ్చేసిన పీఠాధిపతికి ఆలయ రాజగోపురం వద్ద దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఎం.శ్రీనివాసరావు, ప్రధానార్చకులు శ్రీశైల జగద్గురు పీఠాధిపతికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం పీఠాధిపతి మల్లికార్జున స్వామికి రుద్రాభిషేకం, భ్రమరాంబాదేవికి కుంకుమార్చన తదితర ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. అనంతరం అమ్మవారి ఆలయం వద్ద ఉన్న ఆశీర్వచన మండపంలో పీఠాధిపతి గౌరవార్థం అర్చకులు, వేదపండితులు వేదగోష్టి నిర్వహించారు.


