● శ్రీమఠం పీఠాధిపతి సుబుధేంద్ర తీర్థులు
మంత్రాలయం: భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని శ్రీమఠం అధికారులను పీఠాధిపతి సుబుధేంద్రతీర్థులు ఆదేశించారు. భక్తులకు ఇబ్బంది కలిగిస్తే చర్యలు తప్పవని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మఠం అధికారులతో కలసి అన్నపూర్ణ భోజనశాల, వీఐపీ భోజనశాల, కల్పతర్వు క్యూ కాంపెక్స్‌ను తనిఖీ చేశారు. అన్నప్రసాదం ఎలా ఉందని భక్తులను అడిగి తెలుసుకున్నారు. క్యూ కాంపెక్స్‌లో భక్తులకు ఇబ్బంది లేకుండా చూడాలని అధికారులకు సూచించారు. వంటశాలల్లో సిబ్బందితో మట్లాడి పలు సూచనలు ఇచ్చారు. ఎండతీవ్రత దృష్ట్యా అన్నపూర్ణ భోజన రహదారికి తడకలతో నీడ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. క్యూ కాంప్లెక్స్‌లో నీటి వసతి కల్పించాలన్నారు. కార్యక్రమంలో మేనేజర్ శ్రీనివాసరావు, ప్రధాన అర్చకులు, అధికారులు పాల్గొన్నారు.


