అడవి రక్షణకు ఫైర్‌లైన్స్‌ | - | Sakshi
Sakshi News home page

అడవి రక్షణకు ఫైర్‌లైన్స్‌

Apr 27 2026 8:12 AM | Updated on Apr 27 2026 8:12 AM

జిల్లాలో అడవుల మొత్తం విస్తీర్ణం: 35,127.80 హెక్టార్లు అందరి బాధ్యత

అటవీ రేంజ్‌ల వారీగా వివరాలు..

కర్నూలు ఆదోని

సెక్షన్లు :2 బీట్లు: 6 సెక్షన్లు: 3 బీట్లు: 11 అటవీ విస్తీర్ణం : 15,276.21 హెక్టార్లు అటవీ విస్తీర్ణం: 19,851.95 హెక్టార్లు

మండలాలు : వెల్దుర్తి, సి.బెళగల్‌, కర్నూలు మండలాలు: కోసిగి, కౌతాళం, మంత్రాలయం,

కోడుమూరు, కల్లూరు, ఓర్వకల్లు గూడూరు, నందవరం, పెద్దకడుబూరు,

కృష్ణగిరి. ఎమ్మిగనూరు, గోనెగండ్ల, ఆదోని, హోళగుంద,

ఆస్పరి, ఆలూరు, దేవనకొండ, పత్తికొండ,

హాలహర్వి, తుగ్గలి, మద్దికెర ఈస్ట్‌, చిప్పగిరి.

కర్నూలు కల్చరల్‌: వేసవి కాలం వచ్చిందంటే చాలు అగ్ని ప్రమాదాల భయం వెంటాడుతోంది. తెలిసో తెలియకో చేస్తున్న మానవ తప్పిదాలు అడువులను కాల్చి వేస్తున్నాయి. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఎక్కడో ఒక చోట ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. దీంతో పర్యావరణానికి ముప్పు వాటిల్లుతోంది. ఈ నేపథ్యంలో అడవుల సంరక్షణకు అటవీ శాఖ అధికారులు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించారు. జంతు జాతులను కాపాడుకునేందుకు కార్యాచరణను అమలు చేస్తున్నారు. అరుదైన వృక్షాల పరిరక్షణకు పటిష్ట చర్యలు చేపట్టారు. పక్షులు, ఇతర జీవుల దాహార్తి తీర్చేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. అగ్ని ప్రమాదాలు సంభవించకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. నిప్పు రాజుకున్నా.. మంటలు వ్యాప్తి చెందకుండా అర్పివేసేందుకు ప్రత్యేక సిబ్బందికి బాధ్యతలు అప్పగించారు. వారు అప్రమత్తంగా ఉంటూ పరిిస్థితులను పరిశీలించేలా ఆదేశాలు జారీ చేశారు.

కట్టుదిట్టంగా నిఘా

వేసివి కాలంలో నేపథ్యంలో అటవీ శాఖ ముందస్తు చర్యలు చేపట్టింది. అడువులను అగ్నికీలల నుంచి కాపాడేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తోంది. కన్జర్వేటర్‌ ఆఫ్‌ పారెస్ట్‌ బీవీఏ కృష్ణమూర్తి పర్యవేక్షణలో ఎలాంటి ప్రమాదాలు సంభవించకుండా కట్టుదిట్టంగా నిఘా పెడుతోంది. ఇందు కోసం ప్రత్యేకంగా పలువురు అధికారులకు విధులు కేటాయించింది. అటవీ సంరక్షణ, అక్రమ రవాణా కట్టడికి గ్రామాల్లో కళాజాతా బృందాల ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకువస్తున్నారు. అడవులకు నిప్పు పెట్టడం వల్ల జరిగే నష్టాలపై అవగాహన కల్పిస్తున్నారు.

ప్రత్యేక బృందాలు

అగ్ని ప్రమాదాలు సంభవిస్తే మంటలను అదుపు చేసేందుకు అటవీ శాఖ అధికారులు జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే 10 మందితో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. వీరు పెట్రోలింగ్‌ చేయడంతో పాటు అడవిలో పరిస్థితులను గమనిస్తుంటారు. వారికి కావాల్సిన నీళ్ల బాటిళ్లు, బూట్లు, డ్రెస్‌, సేఫ్టీ కిట్స్‌ను అందించారు. కర్నూలు సిటీ ఫారెస్ట్‌, సోమయాజుల పల్లె ఫారెస్ట్‌ ప్రాంతాల్లో వీరు పెట్రోలింగ్‌ చేస్తుంటారు. అటవీ ప్రాంతంలో రాజుకునే మంటలను ఎస్‌ఎన్‌పీపీ శాటిలైట్‌ సహకారంతో డీఎఫ్‌ఓలు ఎప్పటికప్పుడు తెలుసుకుని ఆ మేరకు సిబ్బందిని అప్రమత్తం చేస్తున్నారు.

ఫైర్‌లైన్స్‌లో ఎండుటాకుల తొలగింపు

అడవుల్లో మంటలను అందుపు చేయడానికి వీలుగా అటవీశాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. మంటలు వ్యాపించకుండా అర్పేందుకు వీలుగా ఫైర్‌లైన్స్‌ ఏర్పాటు చేస్తున్నారు. కర్నూలు డివిజన్‌లో కర్నూలు నగరవనం, సోమయాజుల పల్లె ప్రాంతాల్లో 12 కి.మీ., ఆదోని డివిజన్‌లో 18 కి.మీ. మేర ఫైర్‌లైన్స్‌ ఏర్పాటు చేశారు. 8 నుంచి 10 మీటర్లు వెడల్పుతో ఒకే వరుసలో చెట్లను, ఎండుటాకులను తొలగిస్తున్నారు. దీంతో మంటలు ఎక్కడికక్కడ ఆగిపోయే అవకాశం ఉంటుందని అధికారులు వివరిస్తున్నారు.

సాసర్‌ పిట్‌ల ఏర్పాటు

ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురవడంతో ప్రస్తుతం నీటి ఎద్దడి లేదు. అయినప్పటికీ వేసవి కారణంగా భవిష్యత్‌ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అటవీ ప్రాంతాల్లో కర్నూలు డివిజన్‌లో 17, ఆదోని డివిజన్‌లో 21 సాసర్‌ పిట్‌లను గుర్తించారు. ఇంకా అవసరమైన చోట్ల పిట్‌లను ఏర్పాటు చేసేందుకు ప్రణాళిక రూపొందించారు. జంతువుల దాహార్తిని తీర్చేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపడుతున్నట్లు అధికారులు వెల్లడిస్తున్నారు.

అడవుల్లో అగ్ని ప్రమాదాల నివారణకు సిబ్బందిని నియమించి ప్రత్యేక శిక్షణ ఇచ్చాం. వారికి ఫైర్‌ బ్లోయర్స్‌ అందించాం. ఎక్కడైనా ప్రమాదం జరిగితే వారు వెంటనే స్పందించి మంటలు వ్యాపించకుండా చర్యలు తీసుకుంటారు. అడవికి ఎవరూ నిప్పు పెట్ట కూడదు. దీనిపై ప్రజల్లో చైతన్యం రావాలి. అడవులను సంరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది.

– పి.శ్యామల, ఐఎఫ్‌ఎస్‌, జిల్లా అటవీ శాఖ అధికారి

అడవుల్లో అగ్ని ప్రమాదాల

నివారణకు చర్యలు

ఫైర్‌ వాచర్లతో నిరంతర పర్యవేక్షణ

పటిష్టంగా 45 కి.మీ.ఫైర్‌ లైన్స్‌

ఏర్పాటు

అగ్ని ప్రమాదాల నివారణ చర్యలకు

రూ.10 లక్షల నిధులు

Advertisement
 
Advertisement
Advertisement