అసలు చెల్లిస్తే వడ్డీ మాఫీ అవుతుంది | - | Sakshi
Sakshi News home page

అసలు చెల్లిస్తే వడ్డీ మాఫీ అవుతుంది

Apr 27 2026 8:12 AM | Updated on Apr 27 2026 8:12 AM

అసలు చెల్లిస్తే వడ్డీ మాఫీ అవుతుంది లబ్ధిదారులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు ఇంత ఒత్తిడి చేయడం తగదు

ఈ పథకాలకు సంబంధించి ఈ నెల 30వ తేదీ నాటికి అసలు చెల్లిస్తే గత ఏడాది డిసెంబర్‌ 31వ తేదీ వరకు అయిన వడ్డీని పూర్తిగా మాఫీ చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నేఫథ్యంలోనే ఇప్పటి వరకు ఆయా పథకాల ద్వారా లబ్ధిదారులు రూ.60 లక్షల వరకు చెల్లించారు. రుణాలు తిరిగి చెల్లించే విషయంలో లబ్ధిదారులకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించేందుకు కరపత్రాలను పంపిణీ చేస్తున్నాం. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నెలవారీ లక్ష్యాలను పూర్తి చేసేందుకు తమ వంతు కృషి చేస్తున్నాం.

– కే తులసీదేవి, ఈడీ, ఎస్సీ కార్పొరేషన్‌

ఎన్‌ఎస్‌ఎఫ్‌డీసీ, ఎన్‌ఎస్‌కేఎఫ్‌డీసీ పథకాల కింద లబ్దిపొందిన వారికి రికవరీ పేరుతో చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఆయా పథకాల కింద ఏర్పాటు చేసుకున్న చిరు వ్యాపారాలు జరగక, తీసుకున్న వాహనాలకు అద్దెలు లభించక అనేక మంది లబ్ధిదారులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారు. వాయిదాలు సరైన సమయానికి చెల్లించలేక పోతున్నారు. ఈ రుణాలను ప్రభుత్వం పూర్తిగా రద్దు చేసి ఎస్సీ లబ్ధిదారులకు ఉపశమనం కల్పించాలి.

– కాసారపు వెంకటేష్‌,

మాల సంఘాల జేఏసీ కన్వీనర్‌

ఎస్సీ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించాలని ఇంత తీవ్ర స్థాయిలో ఒత్తిడి చేయడం తగదు. గతంలో ఎప్పుడు ఇలా వసూలు చేసింది లేదు. ఆయా పథకాల ద్వారా పెట్టుకున్న వ్యాపారాలు జరగక ఎస్సీ లబ్ధిదారులు అనేక ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అప్పులు కట్టాలని ఒత్తిడి చేయడం వల్ల అనేక మంది అనారోగ్యం పాలవుతున్నారు. మానవతా ధృక్పథంతో ప్రభుత్వం ఈ రుణాల రికవరీపై పునరాలోచించాల్సి ఉంది.

– చిటికెల సామెల్‌, మాజీ డీవీఎంసీ సభ్యులు

Advertisement
 
Advertisement
Advertisement