ప్రమాదకరంగా ఈత | - | Sakshi
Sakshi News home page

ప్రమాదకరంగా ఈత

Apr 27 2026 7:30 AM | Updated on Apr 27 2026 7:30 AM

సుంకేసుల క్రస్టు గేట్ల దగ్గర చిన్నారుల ఈత

పట్టించుకోని అధికారులు

కర్నూలు సిటీ: సుంకేసుల బ్యారేజీ దగ్గర ప్రమాదకరమైన ప్రదేశంలో చిన్నారులు ఈత కొడుతున్నారు. ఇటీవలే విద్యా సంస్థలకు సెలవులు ఇవ్వడం, ఆదివారం రోజున బ్యారేజీ దగ్గర సరగాగా గడిపేందుకు స్నేహితులు, కుటుంబ సభ్యులతో వెళ్తుంటారు. ఇలాంటి అనేక సందర్భాల్లో ఈత సక్రమంగా రాక..ఈత వచ్చిన పెద్ద పెద్ద గుంతల్లో చిక్కుకోని నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. బ్యారేజీ క్రస్టు గేట్ల నుంచి విడుదల చేసే నీటితో దిగువన గుంతలు ఏర్పడి లోతు ఎక్కువగా ఉండి నీరు నిల్వ ఉంటుంది. గేట్లకు సమీపంలో ఏ ఒక్కరు కూడా ఈతకు కానీ, సరదాగా కూడా వెళ్లకూడదు. అయితే ఆదివారం 25, 26 గేట్లకు దిగువన చిన్న పిల్లలతో కలిసి ప్రమాదకరమైన ప్రదేశంలో ఈత చేస్తున్నారు. ఇలాంటి ప్రదేశంలోకి ఇతరులు ఎవరూ వెళ్ళకుండా చూడాల్సిన బ్యారేజీ సిబ్బంది పట్టించుకోకపోవడంతోనే క్రస్టు గేట్ల వరకు వెళ్ళుతున్నారని తెలుస్తోంది. ఇప్పటికై నా బ్యారేజీ అధికారులు స్పందించి ప్రమాదాలు జరుగకుండా చూడాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయ పడుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement